Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

VV Vinayak to direct Bala Krishna..?

By   /  February 18, 2017  /  Comments Off on VV Vinayak to direct Bala Krishna..?

    Print       Email

vv-vinayak-bala-krishna1బాలయ్య – వినాయక్ కాంబినేషన్ లో మూవీ..?

 

InCorpTaxAct
Suvidha

 

 

నందమూరి బాలకృష్ణ – క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’. ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం బాలయ్య సక్సెస్ జోష్ లో ఉన్నారు. ఆయన ఇదే జోష్ ను కంటిన్యూ చేయనున్నారు. చాలా ఉత్సాహంగా బాలయ్య తన 101వ చిత్రం కోసం కసరత్తు చేస్తున్నారు. ప్రెజెంట్ పలు రకాల కథలు వింటున్నారు. అయితే ఇప్పటివరకు ఆయనకు నచ్చిన కథ ఒకటీ కూడా లేదని ఫిల్మ్ నగర్ టాక్.

101వ చిత్రం కోసం గతంలో చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే ప్రెజెంట్ రేస్ లో వి.వి.వినాయక్ పేరు బాగా టాప్ లో ఉంది. మెగాస్టార్ రీఎంట్రీ మూవీతో హిట్ కొట్టిన వినాయక్ మంచి పవర్ ఫుల్ స్టోరీని బాలయ్యకు వినిపించారని టాక్. ఇప్పటివరకు వినాయక్ మరో మెగా ఫ్యామిలీ హీరోతో చేస్తారని ప్రచారం సాగింది. కాని తాజాగా ఆయన బాలయ్యతో సినిమా చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ లో ప్రచారం సాగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →