Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

VVS Laxman: “మన ఆణిముత్యాలు – 20..వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్..”

By   /  October 31, 2016  /  No Comments

    Print       Email
image1ఎంతో స్పూర్తిదాయకమైన ఆటతీరుకు ఒక మచ్చుతునక..డేరింగ్ మరి డాషింగ్ క్రికెట్  హీరో..యంగ్ స్టార్..V.V.S.LAXMAN..

”వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్ ” నవంబర్ 1  , 1974 హైదరాబాద్ లో జన్మించాడు. లక్ష్మణ్ భారతదేశ క్రికెట్ జట్టు సభ్యుడిగా పలు విజయాలు అందించిన అద్భుతమైన ఆటగాడు. లక్ష్మణ్ ఇంతవరకు 127 టెస్టు మ్యాచ్‌లకు మరియు 86 వన్డే మ్యాచ్‌లకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులలో 16 శతకాలు, వన్డేలలో 6 శతకాలు సాధించాడు. టెస్టులలో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 281 పరుగులు. భారతీయ దేశవాళీ క్రికెట్ లో లక్ష్మణ్ హైదరాబాద్ జట్టు కు మరియు ఇంగ్లాండ్ ధేశవాళ్హీ క్రికెట్ లో లాంకషైర్ తరపున ప్రాతినిధ్యం వహింఛాదు. 2008 లో జరిగిన మొట్టమొధటి ఐ పి యల్ లో దక్కన్ చార్జెర్స్ జట్టుకు లక్ష్మణ్ నాయకత్వం వహించాడు.2011 లో లక్ష్మణ్ కు పద్మశ్రీ పురస్కారం దక్కినది.

1996 లో దక్షిణాఫ్రికా  జట్టుతో అహమ్మదాబాద్లో ఆడిన టెస్ట్ మ్యాచ్ లో అరంగ్రేట్రం చేసి యాభై పరుగులు చేసాడు. కాని తరువాత లక్ష్మణ్ భారత అంతర్జాతీయ జట్టులో స్థానం నిలుపుకోలేకపోయాడు. 1997లో దకిణాప్రికాతో ఓపెనింగ్ చేయడానికి పంపబడ్డాడు, కాని విఫలం అయ్యాడు. ఇలా మూడు సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్టులో స్థానం స్థిరంగా నిలుపుకోలేకపోయాడు.తిరిగిజనవరి 2000 సంవత్సరంలో భారత్ ఆస్ట్రేలియాకు జరిగిన సీరిస్ లో ఆస్ట్రేలియాజట్టుతో సిడ్నీలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో 167 పరుగులు చేసి తన సత్తా చూపాడు.
vvs_laxman_with_his_family_at_teri_university_receiving_the_doctoral_degreeలక్ష్మణ్ ఆట తీరు నాటకీయంగా ఈ సిరీస్ లో మారిపోయింది, ముంబాయి లో జరిగిన మొదటి టెస్ట్ లో లక్ష్మణ్ 20 మరియు 12 పరుగులు చేసాడు. భారత్ ఈ టెస్ట్ లో పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయినా తరువాత 2001 లో కలకత్తాలో జరిగిన రెండవ టెస్ట్ లో అత్యంత ఒత్తిడి లో ఆస్ట్రేలియా పై ఫాలోఆన్ ఆడుతూ అసాధారణ రీతిలో 281 పరుగులు చేయడము లక్ష్మణ్ కు పేరుప్రఖ్యాతలు తెచ్చింది. ఈ క్రమంలో అతడు చాలా కాలం క్రితం సునీల్ గవాస్కర్ 236(నాటౌట్) పరుగుల రికార్డును అధిగమించాడు. . కలకత్తా లో జరిగిన ఈ టెస్ట్‌లో రాహుల్ ద్రావిడ్‌తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యము సాధించాడు. లక్ష్మణ్ ఈ ఇన్నింగ్స్ మంచి పరిణామానికి దారి తీసింది. అంతకు ముందు టెస్టును ఇన్నింగ్స్ తేడా తో ఓడిపోయినప్పటికి మిగిలిన 2 టెస్టులు గెలిచి స్టీవ్ వా యొక్క ” చివరి సరిహద్దు” కలను వమ్ము చేసాడు. ప్రదర్శన భారత క్రికెట్ లో ఒక ఇతిహాసం గా నిలిచిపోయింది. ప్రపంచంలోని అత్యద్బుత ప్రదర్శనలలో ఆరవది గా విజ్డన్ పత్రిక గుర్తించింది.తర్వాత కొన్ని సంవత్సరాలు లక్ష్మణ్ స్థానము ఒక రోజు పోటీ లకు, టెస్ట్ లకు పదిలం చేసుకున్నాడు. తర్వాత అతను తన ఆట తీరును ఇండియా ఆస్ట్రేలియా పర్యటన వరకు కొనసాగించాడు. ఇక్కడ అతను మూడు వన్డే , రెండు టెస్టు శతకాలు సాధించాడు. అతడు ఆస్ట్రేలియా పైన అడిలైడ్ లో 148 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో రాహుల్ ద్రావిడ్ తో మరోసారి 300 పరుగుల భాగస్వామ్యము సాధించాడు. రెండు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా పై వారి సొంత గడ్డ పై గెలవడానికి ఈ ఇన్నింగ్స్ ఉపయోగపడింది. అతను సిడ్నీ టెస్ట్ లో 178 పరగులు చేసి సచిన్ తో కలిసి మరోసారి 300 పరుగుల భాగస్వామ్యము సాధించాడు.ఈ కారణము వలన ఇయాన్ చాపెల్  లక్ష్మణ్ ను ” చాలా చాలా ప్రత్యేకమైన లక్ష్మణ్ ( very very special Laxman) అని వర్ణించాడు.
కాని లక్ష్మణ్ ఆటతీరు ఆస్ట్రేలియా పర్యటన నుండి తగ్గుతూ వచ్చింది. 2004 మార్చ్ లో పాకిస్తాన్ పర్యటన నుండి జింబాబ్వే ( ఐసిసి ర్యాంకింగ్స్ లో చివరి స్థానం లో ఉన్న దేశము) తో సాధించిన ఒక సెంచరీ తో సహా కేవలము మూడు సెంచరీలు మాత్రమే సాధించాడు. అతను తన 2004లో అభిమాన ఆస్ట్రేలియా తో మన దేశంలో జరిగిన సీరీస్ లో ముంబయి లో జరిగిన టెస్ట్ లో 69 పరుగులు సాధించినా చాలా తడబడ్డాడు. ఆ టెస్ట్ భారత్ గెలిచినప్పటికి సిరీస్ కోల్పోయింది.
2006లో గంగూలీ తో పాటు లక్ష్మణ్ కూడా దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు.
2008 సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ దక్కన్ చార్జర్స్ కు నేతృత్వం వహించాడు. కాని ట్వంటీ-20 ఆటలో తన బ్యాంటింగ్ తీరులో కాని, నాయకత్వం కాని చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఏది ఏమైనా వి.వి.యస్ లక్ష్మణ్ ..హైదరాబాదీ లక్ష్మణ్..మన భారత్ క్రికెట్ చరిత్రలో ఓ గొప్ప క్రికెటర్ గా మిగిలే ఉంటాడు.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →