Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Waiting to meet India PM Modi, says US president Donald Trump..

By   /  March 30, 2017  /  Comments Off on Waiting to meet India PM Modi, says US president Donald Trump..

    Print       Email

donald trump1భారత్ అంటే గౌరవం.. మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నా: డోనాల్డ్ ట్రంప్

 

InCorpTaxAct
Suvidha

 

 

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలువురు దేశాధినేతలతో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలాగే కొందరిని ప్రత్యక్షంగా కలుస్తున్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్రంప్ విక్టరీ తర్వాత శుభాకాంక్షలు తెలిపారు. ఇక భారత్ లోని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది అమెరికాలో చేయబోతున్న పర్యటన కోసం తాము ఎదురుచూస్తున్నట్లుగా వెల్లడించారు.ఈ మేరకు వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. అయితే మోదీ పర్యటన షెడ్యూల్ గురించి మాత్రం వివరించలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఆర్ధిక సంస్కరణల అజెండాకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించారు. తనకు భారత్ అంటే ఎంతో గౌరవం అని అన్నారు. తాను మోదీని వాషింగ్ టన్ లో కలుసుకోవడం కోసం ఎదురుచూస్తున్నట్లుగా చెప్పారు. ఈ మేరకు అధికారిక ప్రకటనలో తెలిపింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →