Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Water Issue betwwen AP & Telangana state

By   /  May 1, 2016  /  Comments Off on Water Issue betwwen AP & Telangana state

    Print       Email

andhrapradeshరెండు రాష్ట్రాల మ‌ధ్య మొద‌లైన నీటి గొడ‌వ‌

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య ఇప్పుడు నీటి గొడ‌వ మొద‌లైంది. పైనున్న తెలంగాణ రాష్ట్రం ఇష్టం వ‌చ్చిన‌ట్లు నీటిని వాడుకోవ‌డాన్ని ఏపీలోని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ తెలంగాణ స‌ర్కార్ చేసేది మంచి ప‌ద్ధ‌తి కాద‌ని, కాస్త మ‌నుషుల్లా ఆలోచించాలని చెబుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏసీ పీఎం చంద్ర‌బాబు త‌న స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టాడ‌ని మండిప‌డుతోంది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌, కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు మాట్లాడుతూ  రాష్ట్రాన్ని క‌రువు రాష్ట్రంగా చేయాల‌ని చంద్ర‌బాబు కంక‌ణం క‌ట్టుకున్న‌ట్లు ఉన్నాడ‌ని విమ‌ర్శిస్తున్నారు. కృష్ణా డెల్టాకు నీళ్లు వచ్చే అవకాశం లేకుండా మహబూబ్ నగర్ నుంచి ఎత్తిపోతల పథకాలతో నీళ్లను తోడేస్తుంటే.. దిగువన ఉన్న ఏపీలోని జిల్లాలతో పాటు.. తెలంగాణలోని ఖమ్మం.. నల్గొండ జిల్లాలకు నీళ్లు రావ‌డం క‌ష్ట‌మ‌వుతుందం టున్నారు. పాలమూరు నుంచి రంగారెడ్డి లిఫ్ట్ అంటారు. డిండి ప్రాజెక్టు అంటారు. మన కళ్ల ముందే 115 టీఎంసీల నీళ్లను కేసీఆర్ తీసుకుపోతున్నా చంద్ర‌బాబు మాత్రం చోద్యం చూస్తున్నాడ‌ని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పోయాడు కాబ‌ట్టే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్ర‌శ్నించ‌లేక పోతున్నాడంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు స్పందిస్తూ వంద మంది బాబులు… వెయ్యి మంది జ‌గ‌న్‌లు వ‌చ్చిన ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌ను ఆప‌లేరంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని స‌స్య‌శ్యామ‌లం చేయ‌డం త‌మ ల‌క్ష్య‌మ‌ని ఉద్ఘాటిస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల మ‌ధ్య నీటి పంప‌కాల గొడ‌వ మొద‌లైంది. ఇది చిలికి చిలికి గాలివాన‌లాగా త‌యార‌వుతుందో… లేదా రెండు తెలుగు రాష్ట్రాల పెద్ద‌లు కూర్చుని ప‌రిష్క‌రించుకుంటారో చూడాలి మ‌రి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →