* మిషన్ కాకతీయ అద్భుత ఫలితాలు
* మిషన్ కాకతీయ 3ను ఘనంగా ఉత్సవాలు జరుపుతాం
* వీడియో కాన్ఫరెన్స్‌లో హరీష్ రావు
గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణా రాష్ట్రంలో ఈ యాసంగి లో దాదాపు 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్టు ఇరిగేషన్ మంత్రి హారీష్‌రావు తెలిపారు. మిషన్ కాకతీయ లో తీసిన పూడికమట్టి వల్ల ఐదేళ్లలో రాని పంటల దిగుబడి గత ఖరీఫ్ లో అధికంగా వచ్చిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.యాసంగి లోను అద్భుత మైన ఫలితాలు రానున్నాయని అన్నారు.మిషన్ కాకతీయ 3 కింద మంజూరైన చెరువుల మట్టిని సాయిల్ టెస్టు చేయించాలని సూచించారు. మిషన్ కాకతీయ 1,2 లాగే మిషన్ కాకతీయ 3 కూడా స్థానిక ప్రజాప్రతినిధులు,ప్రజలను భాగస్వాములను చేసి ఘనంగా ఉత్సవాలు జరిపి పనులు గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ లను మంత్రి ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్ సి బ్లాక్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మిషన్ కాకతీయ 1,2 లతో పాటు మిషన్ కాకతీయ – 3 కింద చేపట్టనున్న పనులను సమీక్షించారు. అలాగే భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులలో ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత వంటి అంశాలను సమీక్షించారు. కొమురంభీం ప్రాజెక్టు ను ఈ ఏడాది పూర్తీ చేసి పూర్తీ ఆయకట్టు 45 వేల ఎకరాలకు సాగునీరందించనున్నామని తెలిపారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్న బాటిల్ నెక్ సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని హరీష్ రావు కోరారు.ఎస్ ఆర్ ఎస్ పి స్టేజి 2 ను ఈ సంవత్సరం ఖరీఫ్ కల్లా పూర్తి చేయాలని సంకల్పించినట్టు చెప్పారు. దీంతో సూర్యాపేట జిల్లాలో ఒక లక్ష 80 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని మంత్రి తెలియజేశారు. ఈ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆ జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. నాగార్జునసాగర్ , నిజాంసాగర్, సింగూరు, ఎస్ఆర్ఎస్పి తదితర ప్రాజక్టులు ఇతర మీడియం ప్రాజెక్టుల గ్యాప్ ఆయకట్టు పూడ్చ వలసి ఉందన్నారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్నతరహా సాగునీటి వనరుల కింద వాస్తవ ఆయకట్టు నిర్ధారి0చాలని ఆదేశించారు. ఇరిగేషన్, రెవిన్యూ, వ్యవసాయ అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని సమీక్షించాలని జిల్లా కలక్టర్లను ఆయన కోరారు.గ్యాప్ ఆయకట్టును పూడ్చడానికి గాను కేంద్ర ప్రభుత్వం ‘బ్రిడ్జింగ్ ద ఆయకట్టు ‘ పధకం కింద నిధులిస్తున్నందున వివిధ భారీ, మధ్యతరహా ప్రాజెక్టులలో ఉన్న గ్యాప్ ఆయకట్టును పూర్తి చేయడానికి ఆయకట్టు ప్రాంత అభివృద్ధి, సాగునీటి నిర్వహణ (క్యాడ్ వామ్) కోసం కేంద్రం ఇస్తున్న నిధులను వాడుకోవాలని హరీశ్ రావు సూచించారు. ఢీల్లీ లో ఏప్రిల్ 7 న కేంద్ర ప్రభుత్వ జలవనరుల
శాఖ ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి చెప్పారు. CADWAM కింద ప్రతిపాదనలు ఇరిగేషన్ అధికారులు వెంటనే ప్రభుత్వానికి పంపించేలా జిల్లా కలక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం CADWAM ను అమలు చేయనుందని మంత్రి గుర్తు చేశారు. ఆయకట్టు లోకలైజేషన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లాల వారీగా ఈ ప్రక్రియను ముగించాలన్నారు. గతంలో పూర్తయిన సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టును రీ లోకలైజ్ చేయాలని కోరారు.మిషన్ కాకతీయ – 2 పనులన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. కాల్వలలో పూడికతీత, కాలువల్లో ని శిధిలాల తొలగింపు తదితర కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. మత్తడి వాగు,సాత్నాల వంటి ప్రాజెక్టుల పనుల పురోగతిని స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని ఆదిలాబాద్ కలెక్టర్ ను మంత్రి కోరారు. సిద్ధిపేట జిల్లా శనిగరం చెరువు ఆధునీకరణ పనులు వెంటనే ప్రారంభించాలని ఆ జిల్లా అధికార యంత్ర0గాన్ని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో స్పెషల్ సి.ఎస్.జోషి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్,సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి, ఇఎన్ సి మురళీధరరావు , ఇ ఎన్ సి విజయప్రకాశ్, ‘ కాడా’ కమిషనర్ డాక్టర్ మల్సూర్, వివిధ జిల్లాల కలెక్టర్లు , సిఇలు సునీల్ , సుధాకర్, భగవంతరావు,శ్యామసుందర్, మధుసూదనరావు, లింగరాజు, శాంసుందర్, సురేశ్, ఖగేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.