Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

We cannot tolerate misbehavior in Assembly: KCR

By   /  March 13, 2018  /  Comments Off on We cannot tolerate misbehavior in Assembly: KCR

    Print       Email

ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తే ఊరుకోం

Suvidha
Biryani Pot

 

 

 

* మండ‌లి చైర్మ‌న్ స్వామిగౌడ్‌పై దాడి దుర‌దృష్ట‌క‌రం
* కాంగ్రెస్ స‌భ్యుల అరాచ‌కాల‌కు ప‌రాకాష్ట‌
* అరాచ‌క శ‌క్తుల‌ను ప్రోత్స‌హించం
* నాలుగేళ్ల నుంచి శాంతి భ‌ద్ర‌త‌లు అదుపులో ఉన్నాయి
* అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌

డెక్క‌న్ అబ్రాడ్‌: “ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు గూండాగిరీ చేస్తున్నారు. రౌడీల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అసెంబ్లీలో దాడి చేయ‌డం దుర‌దృష్ట‌క‌రం. ఇలా ఎవ‌రు చేసినా స‌హించం“ అని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు అన్నారు. రాష్ట్రంలో అరాచక శక్తులను సహించే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ నాయకుల ముసుగులో కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోమ‌న్నారు. ప్రభుత్వం ప్రతి అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప‌లుసార్లు చెప్పామ‌ని, ఎన్ని రోజులైనా చర్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ.. కాంగ్రెస్ నేతలు గొడవ చేయడం సబబు కాదన్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వంపై విషపూరిత ప్రచారం చేస్తున్నార‌ని కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ‌పై వ్య‌క్తిగ‌తంగా దాడి చేస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. చీప్ పాలిటిక్స్‌కు కాంగ్రెస్ సభ్యులు పాల్పడుతున్నార‌ని, ఇలాంటివి చేస్తే ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు.
సభా హక్కులకు భంగం కలిగించొద్దని సీఎం సూచించారు. కాంగ్రెస్ నేతలే నాటకాలు ఆడుతున్నారని, తమకు నాటకం ఆడాల్సిన అవసరం లేదన్నారు. ఈ సభలో కూర్చుంటే వచ్చది ఏమీ లేదు. ఎలాగైన బయటకు వెళ్లాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ సభ్యులు.. గవర్నర్ ప్రసంగం సమయంలో దాడి చేశార‌ని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఇంత అసహనం పనికి రాదన్నారు. శాసనసభను హుందాగా నడిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి సభ్యునిపై ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్లు తమకు సమాచారం ఉందని సీఎం చెప్పారు. నాలుగేళ్ల నుంచి శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, ప్రజలు సంతోషంగా ఉన్నారని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Birthday wishes to legend Ghantasala

Read More →