Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

We did not get Special Status because of TDP Leader Chandrababu Naidu: YS Jagan

By   /  March 13, 2018  /  Comments Off on We did not get Special Status because of TDP Leader Chandrababu Naidu: YS Jagan

    Print       Email

చంద్ర‌బాబు వ‌ల్లే హోదా రాలేదు

Suvidha
Biryani Pot

 

 

 

* కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌డంలో బాబు విఫ‌లం

* నాడు అరుణ్‌జైట్లీకి శాలువాలు క‌ప్పారు

* నేడు కేంద్ర మంత్రుల రాజీనామాలంటూ డ్రామాలు ఆడుతున్నారు

*  బాబు న‌ట‌కు ఆస్కార్ ఆవార్డు ఇచ్చిన త‌క్కువే

* బాప‌ట్ల బ‌హిరంగ స‌భ‌లో బాబుపై నిప్పులు చెరిగిన వైయ‌స్ జ‌గ‌న్‌

డెక్క‌న్ అబ్రాడ్‌: చ‌ంద్ర‌బాబు నాయ‌డు రోజుకో మాట మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతున్న దాంట్లో కొత్త‌ద‌నం ఏమీ లేద‌ని, నాడు బాబు శాలువాలు క‌ప్పి నేడు అన్యాయం చేసింద‌న‌డంలో ఆర్థ‌మేంటి అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ బాప‌ట్ల‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబునై నిప్పులు చెరిగారు.  చంద్ర‌బాబు చాలా బాగా డ్రామాలు ఆడుతున్నార‌ని, ఆయ‌న న‌ట‌న‌కు ఆస్కార్ అవార్డు ఇచ్చినా త‌క్కువేన‌న్నారు. ప్ర‌త్యేక హోదా ఇప్పటివరకు రాకపోవటానికి చంద్రబాబు అసమర్థతే కారణమ‌న్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించటంలో విఫలమైన చంద్రబాబు, నాలుగేళ్లు కాలయాపన చేసి ఇప్పుడు హోదా అంటూ గొంతు చించుకుంటే ఒరిగేదేముంటుందన్నారు.  13వ ప్రణాళికాసంఘం అమలులోవున్న కాలంలో ఏం చేశారని ప్రశ్నించారు. అయినా 2015 నుంచి 14వ ప్రణాళికాసంఘం అమలులోకి వస్తే, 2013లోనే ఏపీ హోదా ఇస్తామంటూ అప్పటి కేంద్రప్రభుత్వం ప్రణాళికాసంఘానికి సిఫార్సు చేసిన విషయాన్ని ఎలా మర్చిపోయారంటూ చంద్రబాబును ప్రశ్నించారు.

2016లో చేసిన ప్రకటననే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తిరిగి వారం క్రితం చేశారన్నారు. అదే ప్రకటనకు అప్పుడు ఢిల్లీ వెళ్ళి శాలువలు కప్పిన చంద్రబాబు, ఇప్పుడు కేంద్ర మంత్రుల రాజీనామాలంటూ నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఒక రాజకీయనేతకు ఉండాల్సిన కనీస అర్హతలైన విశ్వసనీయత, నిజాయితీలు లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందునే ఈ రాష్ట్రంలో రాజకీయాలన్నీ భ్రష్టు పట్టాయన్నారు. అవిశ్వాసం అంటే మద్దతివ్వరు. రాజీనామాలంటే ముందుకు రారు. ప్రశ్నించాలంటే కాలం గడుపుతారు. ఇలాగైతే ఎప్పటికి హోదా సాధిస్తారని ప్రశ్నించారు. ఏప్రిల్ 6న రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ చర్యతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కదలిక వచ్చిన తరువాత కూడా, కేంద్రం హోదా ఎందుకు ఇవ్వదో అప్పుడే చూద్దామన్నారు. కేంద్ర మంత్రివర్గం నుండి మంత్రుల ఉపసంహరణ అనగానే చంద్రబాబులో పోరాట స్ఫూర్తి వచ్చిందోమో అనుకున్నా. కానీ ఇంతలోనే ఎన్డీఎతో భాగస్వామ్యం మాత్రం కొనసాగుతుందని చెప్పి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారని జగన్ ధ్వజమెత్తారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే నిన్నమొన్న ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌కు తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుందా అని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TANA will not let criminals run our well earned reputation, Satish Vemana

Read More →