మేము సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసుకోలేదు: ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్
డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు కాస్తా సంచలనం సృష్టిస్తున్నాయి. వర్మ వ్యాఖ్యలపై ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కొంతమంది చిన్న పిల్లలను కూడా 12 గంటల పాటు ప్రశ్నిస్తారా అంటూ అడుగుతున్నారని అన్నారు. తాము శాస్త్రీయంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. పిల్లలకు డ్రగ్స్ గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. ఇతరులను పిల్లలు డ్రగ్స్ ఉచ్చులోకి లాగుతారా అంటూ ప్రశ్నించారు.ఎవరిని ఎలా విచారించాలో అలాగే విచారణ చేపడతామని అన్నారు.
తమ డ్యూటీని తాము నిర్వర్తిస్తున్నామని దీన్ని వివాదం చేయడం సరికాదని అన్నారు. కేసును నీరుగార్చే ఉద్దేశ్యాలు తమకు లేవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే విచారణ ఆరంభమైందని చెప్పారు. తాము చట్టం ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు. పిల్లలు డ్రగ్స్ కి బానిసలు కాకూడదనే ప్రభుత్వ ఉద్దేశ్యంతోనే తాము విచారణ చేపట్టామని అన్నారు. సాఫ్ట్ వేర్ నిపుణులు, పారిశ్రామిక వేత్తలు ఆ తర్వాత చిత్ర పరిశ్రమ దగ్గరకు వచ్చామని చెప్పారు. అంతేతప్ప కావాలని సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసుకోలేదని చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.