వైఎస్ కుటుంబాన్ని ఓడిస్తాం: సీఎం రమేష్
వైఎస్ జగన్ పై టీడీపీ నేత సీఎం రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్వరలో కడప జిల్లాలో వైఎస్ కుటుంబాన్ని ఓడించబోతున్నామని అన్నారు. అక్కడ సాగుతున్న ఏకపక్ష పాలనకు చరమగీతం పాడబోతున్నామని అన్నారు.ఈ మేరకు టీడీపీ నేతలు సీఎం రమేస్, ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసులురెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ బాబాయ్ వివేకానందరెడ్డిపై టీడపీ తరపున నిలిచిన అభ్యర్ధి బీటెక్ రవి ఖచ్చితంగా గెలుస్తారని ధీమాగా చెప్పారు.
స్థానిక సంస్థలకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరపున వివేకానందరెడ్డి నిలిచిన విషయం తెలిసిందే. తాము నిలబెట్టిన అభ్యర్ధి ఓడిపోతారనే భయంతోనే జగన్ ఓటు వేసేందుకు వచ్చారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం అవసరమైనవి ఏమీ ఇప్పటివరకు కల్పించలేదని ఆరోపించారు. ఇక్కడ చాలా సమావేశాలు జరిగాయని ఆయన అన్నారు. కాని దేనికి రాని జగన్ ఇవాళ తన బాబాయ్ ఓడిపోతారనే భయంతో వచ్చి ఓటు వేశారని ఆరోపించారు. కనీసం తన ఓటు వచ్చినా చాలని జగన్ భావిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.