Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

We will fight for our promises, says Chandra Babu

By   /  August 9, 2016  /  Comments Off on We will fight for our promises, says Chandra Babu

    Print       Email

chandrababuహామీల కోసం పోరాటం చేస్తాం

 

InCorpTaxAct
Suvidha

 

 

కేంద్రం ఇచ్చిన హామీల కోసం ఖ‌చ్చితంగా పోరాటం చేస్తామ‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు స్ప‌ష్టం చేశారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో రాజీప‌డే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. చాలా రోజుల త‌ర్వాత సొంత‌నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడారు.  ఆంధ్రప్రదేశ్‌ను అన్నివిధాలా ఆదుకుని, రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత ఎన్‌డిఎ ప్రభుత్వంపై ఉందని, ఎన్‌డిఎతో క‌లిసి టీడీపీ ముందుకుసాగుతున్నా ఏపీ ప్రయోజనాల విషయంతో రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఏపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నా స్వార్థ రాజకీయాల కోసం, కాంగ్రెస్, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కుటిలరాజకీయాలు చేస్తూ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నాయంటు మండిపడ్డారు. త‌న‌కు ప్ర‌ధాని కావాలనే కోరిక లేదని, ఎప్పుడో ప్రధానిగా ఆఫర్ వచ్చినా త‌న‌కే ఇష్టం లేద‌ని చెప్పాన‌న్నారు.  కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఏపీకి న్యాయం చేయాలన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఎట్టిపరిస్థితిలోనూ వెనక్కితగ్గేదిలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల స్థితిగతులను తెలుసుకుని, వారి సంక్షేమానికి ఎలాంటి పథకాలకు రూపకల్పన చేయాలనే విషయాలను క్షుణ్నంగా తెలుసుకునేందుకే పల్స్ సర్వేను చేపట్టడం జరిగుతోందన్నారు.

ప్రభుత్వం రాష్ట్రంలో లబ్దిదారులకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను యధావిధిగా అమలు చేయడం జరుగుతుందని, మున్ముందు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఆధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకునేందుకు విద్యార్థులు, యువత ముందుండాలని సూచించారు. ఆంధ్రరాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రూ.149కే 100 కేబుల్ ఛానల్స్, ఇంటర్నెట్ కనెక్షన్‌ను నెలాఖరికల్లా అందజేయడం జరుగుతుందన్నారు. ప్రధానంగా అడ్వాన్స్ టెక్నాలజీని విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకునేందుకు ఇంటర్నెట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎల్ఇడి బల్బులను రాష్ట్రవ్యాప్తంగా వీధి దీపాలుగా ఏర్పాటుచేయడం జరుగుతుందని, దీనికి సంబంధించిన సెన్సార్‌లను ఏర్పాటుచేసి మానిటరింగ్‌ను ఒకచోటనుండి చేయడం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →