Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

We will fight until we get special status, says YS Jagan

By   /  September 10, 2016  /  Comments Off on We will fight until we get special status, says YS Jagan

    Print       Email

ysjagan (4)హోదా వ‌చ్చేవ‌ర‌కు పోరాడుదాం

 

InCorpTaxAct
Suvidha

 

 

“ఎవరూ సాధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రమే వచ్చినపుడు, పార్లమెంట్ సాక్షిగా మన హక్కుగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను సాధించుకోలేమా? పోరాటం చేస్తే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. బహుశా చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు ఉన్నంతవరకూ ఆలస్యం కావొచ్చేమో! న్యాయం, ధర్మం ఎప్పటికైనా గెలుస్తాయి. రాష్ట్రం మొత్తం ఒక్కటై పోరాటం చేస్తే మనమూ ప్రత్యేక హోదా తెచ్చుకోవచ్చు. అది ఇవాళే, రేపే వస్తుందని చెప్పను. ఒక నెలలోనే వస్తుందని కూడా చెప్పను. కానీ, పోరాటం చేస్తే తప్పకుండా వస్తుంది“ అని ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నారు. రెండో రోజు(శుక్ర‌వారం) స‌భ వాయిదా ప‌డిన అనంత‌రం అదేరోజు సాయంత్రం అసెంబ్లీ క‌మిటీహాల్‌-3లో జ‌గ‌న్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. గతంలో ప్రత్యేక హోదా కోసం తాను నిరవధిక నిరాహార దీక్షకు పూనుకుంటే, ప్రధాని నరేంద్రమోదీ ఇక రెండు రోజుల్లో వస్తారనగా ఎనిమిదో రోజు తన దీక్షను భగ్నం చేశారని జగన్ గుర్తు చేశారు.

ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనను చంద్రబాబే కాదు ఎవరు స్వాగతించినా ఒప్పుకునేది లేదన్నారు. కొత్తగా ఫలానాది ఇస్తున్నానని జైట్లీ చెప్పక పోగా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని నొక్కి వ‌క్కానించార‌న్నారు. దాన్నే చంద్రబాబు అర్ధ‌రాత్రి విలేకరుల సమావేశం పెట్టి స్వాగతించడమేకాక  హోదా కాదన్నప్పుడు ప్రత్యామ్నాయాన్ని వద్దనలేమ‌ని చెప్ప‌లేం క‌దా అని చెప్ప‌డం సిగ్గుచేట‌న్నారు. కేంద్రం ఇంత స్పష్టంగా ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్పినపుడు సీఎంగా ఉన్న వ్యక్తి కేంద్రానికి బుద్ధి వచ్చేలా త‌న మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకోవాల‌న్నారు.

“చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయలేక పోవడానికి కారణం ఒక్కటే… ఓటుకు కోట్లు కేసు, ఈ మధ్య ఏసీబీ కోర్టు ఎప్పుడైతే చంద్రబాబు పాత్ర మీద విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించిందో అప్పటి నుంచీ ఈ నాటకం ప్రారంభం అయింది. వెంటనే కేంద్రంతో చంద్రబాబు బేరసారాలు ప్రారంభించారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వక పోయినా … కేంద్రం వెళ్లిపో అన్నా బాబు వెళ్లేట్లు లేడు. వాళ్ల కాళ్లు పట్టుకునైనా సరే వాళ్లేమీ చేయక పోయినా సరే వాళ్లతోనే ఉండాలనుకుంటున్నారు. అందుకు కారణం కోట్ల రూపాయల నల్లధనం వెచ్చిస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిపోయి కేసులో ఇరుక్కోవడమే! ఆ కేసులో నుంచి బయటపడేందుకు ఐదు కోట్ల మంది ప్రజలను వెన్ను పోటు పొడిచారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఇలాంటి వ్యక్తి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను“ అని జ‌గ‌న్ అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →