Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

We will punish the guilty, Modi promises to India

By   /  April 14, 2018  /  Comments Off on We will punish the guilty, Modi promises to India

    Print       Email

యావ‌త్ దేశానికి హామీ ఇస్తున్నా.. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తాం

Suvidha
Biryani Pot

 

 

 

 

* బాధితుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది

* మ‌న బిడ్డ‌ల‌కు త‌ప్ప‌క న్యాయం జ‌రుగుతుంది

* ద‌ళితుల అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నాం

* ఢిల్లీలో అంబేద్క‌ర్ స్మార‌క కేంద్రం ఆవిష్క‌ర‌ణ‌లో ప్ర‌ధాని మోడీ

డెక్క‌న్ అబ్రాడ్‌: దేశంలో జ‌రుగుతున్న అత్యాచార ఘ‌ట‌న‌లపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్పందించారు. క‌థువా, ఉన్నావ్ అత్యాచార ఘ‌ట‌న‌లు దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు దారి తీసిన నేప‌థ్యంలో ప్ర‌ధాని స్పందిస్తూ ఇలాంటి ఘ‌ట‌న‌లు సిగ్గుచేట‌న్నారు. నాగ‌రిక ప్ర‌పంచంలో ఇలువంటివి జ‌ర‌గ‌కూడ‌ద‌న్నారు. ఈ ఘటనల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ నిందితుల తప్పించుకోలేరని వారిని కఠినంగా శిక్షిస్తామని, యావత్ దేశానికి తాను హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, మన బిడ్డలకు తప్పక న్యాయం జరుగుతుందని వెల్లడించారు. ఢిల్లీలోని అలీపుర్ రోడ్డులో నిర్మించిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ స్మారక కేంద్రాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన లోక కల్యాణ్ మార్గ్ నుంచి అలీపుర్ రోడ్డు వరకు మెట్రో రైలులో వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సభలో ఆయన మట్లాడుతూ.. అత్యాచార ఘటనల నిందితులను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అలాగే దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపైనా ఆయన స్పందించారు. దళితులు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అండగా ఉంటామని మోదీ చెప్పారు.

కాంగ్రెస్ ఎప్పుడూ దళితుల సంక్షేమం కోసం పని చేయలేదని ఆరోపించారు. దళితులపై దాడులను నివారించేందుకు 2015లో తమ ప్రభుత్వం సంబంధిత చట్టాని మరింత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. వారికి సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశామన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందని, అటువంటి పార్టీ ప్రచారం చేస్తున్న అవాస్తవాలను నమ్మొద్దని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నో ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ స్మారక కేంద్రం పనులు ఆలస్యమవడానికి గత ప్రభుత్వాలే కారణమని అన్నారు. అంబేద్కర్‌ను గౌరవించే దిశగా కాంగ్రెస్ చిన్నపని చేసినా చెప్పాలంటూ మోదీ సవాలు విసిరారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ అంబేద్కర్ స్మారక నిర్మాణం గురించి ఆలోచించలేదని, ఇప్పుడు తాము దీన్ని ఆయన గౌరవార్థం దేశానికి అంకితం ఇస్తున్నామని చెప్పారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Birthday wishes to legend Ghantasala

Read More →