Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

What did Lokesh discuss with speaker kodela siva Prasad?

By   /  August 22, 2016  /  Comments Off on What did Lokesh discuss with speaker kodela siva Prasad?

    Print       Email

nara lokesh newకోడెల‌తో లోకేష్ ఏం మాట్లాడారు?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ తో  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మూడు గంట‌ల పాటు స‌మావేశం కావ‌డంపై  రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. అసలు ఇంత సేపు వీరిద్దరూ ఏమి మాట్లాడుకుని ఉంటారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉన్న సమయంలో అత్యంత సంక్లిష్టమైన గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత అయిన కోడెల తో లోకేష్ సుదీర్ఘ భేటీకి కారణాలు ఏమై ఉంటాయా? అనే అంశంపై పార్టీ నేతలు రకరకాలుగా  చర్చించుకుంటున్నారు. గుంటూరులోని రహదారులు, భవనాల శాఖ అతిధిగృహంలో వీరి భేటీ నడించింది. తాను సభాపతి కోడెలను కలవక మూడు నాలుగు నెలలు అవుతుందని, గుంటూరులో ఆయన ఉండటంతో వచ్చి కలిశానని లోకేష్ పైకి చెబుతున్నా..లోప‌ల మాత్రం వేరే జ‌రిగి ఉంటుంద‌ని టీడీపీకి చెందిన కొంత‌మంది ఎమ్మెల్యేలే చెవులు కొరుక్కుంటున్నారు.

ఇదిలా ఉంటే స్పీక‌ర్ కోడెల చంద్ర‌బాబుపై అలిగిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పి, నేటికీ ఇవ్వ‌డం లేద‌ని కోడెల బాబుపై గుస్స‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే లోకేష్ రంగంలో దిగిన‌ట్లు స‌మాచారం. ఈసారి జ‌ర‌గ‌బోయే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌ప్ప‌కుండా మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని కోడెల శివ‌ప్ర‌సాద్‌కు లోకేష్ హామీ ఇచ్చిన‌ట్లు ఆ పార్టీకి చెందిన కొంత‌మంది ఎమ్మెల్యేలు చెబుతున్నారు. లోకేష్, కోడెల మ‌ధ్య మ‌రికొన్ని విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోని విష‌యం, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏడాదిపాటు స‌స్పెండ్ చేయ‌డం వంటి అంశాలు వాళ్లిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. కాగా కోడెల‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుందో.. రాదో తెలుసుకోవ‌డానికి మ‌రికొంతకాలం ఆగ‌క త‌ప్ప‌దు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →