శ్రీకాంత్ బదిలీ వెనుక కుట్ర ఉందా?
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్ డీఏ) కమిషనర్ గా ఉన్న నాగులపల్లి శ్రీకాంత్ ను ఆకస్మికంగా బదిలీ చేయటానికి కారణం ఏంటి?. చంద్రబాబు నాయుడు కోరి తెచ్చివేసుకున్నారు కదా. అప్పుడే ఎందుకు వేటు వేశారు?. కారణం అదే అయి ఉంటుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా వివాదస్పద స్విస్ ఛాలెంజ్ విధానంలో దూసుకెళుతుండటంతో శ్రీకాంత్ అక్కడక్కడ బ్రేకులు వేశారట. ఈ విధానానికి సంబంధించి సర్కారు చేసిన ఒప్పందాలు…నిబంధనలు..ఉల్లంఘనలను స్పష్టంగా ఫైల్ లోనే రాశారట కూడా. అదే సమయంలో మౌలికసదుపాయాల కల్పనకు సంబంధించి కూడా ఆయన కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సింగపూర్ సంస్థల కోసం సర్కారు ఏకంగా 5500 కోట్ల రూపాయల వ్యయంతో మౌలికసదుపాయాలు కల్పించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రైవేట్ సంస్థల వ్యాపారానికి భూమి ఇవ్వటం కాకుండా..అక్కడ మౌలికసదుపాయాలు కల్పించి..సమీప భవిష్యత్ లో ఆ పరిసర ప్రాంతాల్లో మరే ఇదే తరహా ప్రాజెక్టులు రాకుండా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. వీటిలో చాలా వాటిపై శ్రీకాంత్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
అందుకే శిక్షణకు వెళతానన్న శ్రీకాంత్ ను వెంటనే రిలీవ్ చేసి..చంద్రబాబునాయుడు తాను కోరుకున్న విధంగా పని పూర్తి చేయించుకున్నారు. ఇప్పుడు శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన శ్రీకాంత్ రిపోర్ట్ చేయటానికి రెడీ కాగా..సీఆర్ డీఏలో కుదరదని తేల్చి చెప్పేశారు. జీఏడీ (పొలిటికల్ ) కార్యదర్శిగా నియమించారు. ఇంకా చాలా సర్వీస్ ఉన్న శ్రీకాంత్ స్విస్ ఛాలెంజ్ విషయంలో చాలా వరకూ జాగ్రత్తలు తీసుకున్నారని…ఎక్కువ శాతం ప్రభుత్వం..సీఎం చేతుల మీదుగా పని పూర్తయ్యేలా వ్యవహరించారని చెబుతున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.