Loading...
You are here:  Home  >  Business News  >  Current Article

what is the secret with Modi?

By   /  July 4, 2016  /  Comments Off on what is the secret with Modi?

    Print       Email

Narender Modi gifts 80K-cr package to J&Kమోడీ విజ‌య‌ర‌హ‌స్యం అదేనా?

 

InCorpTaxAct
Suvidha

 

 

గ‌తంలో ప‌నిచేసిన ప్ర‌ధాన మంత్రుల‌కు.. ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఉన్న తేడా ఏంటి?  మోడీకి ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు రావ‌డానికి కార‌ణం ఏంటి? ఎందులో మోడీ గొప్ప‌? అనే ప్ర‌శ్న‌ల‌కు అన్నింటికే ఒక్క‌టే స‌మాధానం చెప్పాల్సి వ‌స్తే మాత్రం ఆయ‌న మాట‌లే అని చెప్పాలి. మోడీ త‌న మాట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్న‌ట్లుగా గ‌తంలో ఏ ప్ర‌ధాని అంత‌లా ఆక‌ట్టుకోలేద‌నే చెప్పొచ్చు. మోడీ ఎక్క‌డ ఏ స‌భ పెట్టినా విజ‌య‌వంతం కావ‌డానికి ఆ మాట‌లే కార‌ణం. ప్ర‌పంచ దేశాలు కూడా మోడీ ప్ర‌సంగానికి ఫిదా అయిపోతున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. అందుకే  మోడీ త‌న మాట‌ల‌నే న‌మ్ముకుని మ‌న్ కీ బాత్‌పేరుతో ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తున్నాడు.   దేశ ప్రధాని రేడియోలో ఒక క్రమపద్ధతిలో మన్ కీ బాత్ పేరిట ముచ్చట్లు చెప్పటం.. వివిధ అంశాల మీద తన వైఖరిని చెప్పటంతోపాటు.. తనకు తెలిసిన.. తన దృష్టికి వచ్చిన పలు విశేషాల్ని ప్రజలతో పంచుకునే కార్యక్రమం మోడీ ఇమేజ్ ను మరింత పెంచిందని చెప్పాలి. తాజాగా ఇదే మన్ కీ బాత్ ను బంగ్లాదేశ్ ప్రజల్ని ఉద్దేశించి కూడా ప్రధాని మోడీ మాట్లాడనుండటం గమనార్హం.

విదేశీ ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించటం ఒక రికార్డుగా చెప్పాలి. బంగ్లాదేశ్‌లో ఆకాశవాణి తన రేడియో స్టేషన్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో.. అందులో బంగ్లాదేశీయుల్ని ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. బంగ్లాదేశ్ తో భారత్ కు స్నేహ సంబంధాల్ని గుర్తు చేయటం.. భారత్ అంటే బంగ్లాదేశ్ కు అత్యంత ఆఫ్తుడన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పటం.. జనసామ్యంలోకి తన మాటల్ని వెళ్లేలా చేయాలని ప్రధాని భావిస్తున్నారు.  కాగా  బంగ్లాదేశ్ లో ప్రసారాలు చేసే ఈ రేడియో స్టేషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →