Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

What is wrong if Congress and TDP form alliance in next elections? : UttamKUmar Reddy

By   /  April 12, 2018  /  Comments Off on What is wrong if Congress and TDP form alliance in next elections? : UttamKUmar Reddy

    Print       Email

టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే త‌ప్పేంటి?

InCorpTaxAct
Suvidha

 

 

 

 

*అయినా పొత్తు విష‌యం అధిష్టానం నిర్ణ‌యిస్తుంది

* టీఆర్ఎస్ నాయ‌కులు కూడా కాంగ్రెస్‌లో చేరుతారు

* సెటిల‌ర్ల‌కు సీట్లు ఇస్తాం

* వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ కాంగ్రెస్ గెల‌వ‌డం ఖాయం

డెక్క‌న్ అబ్రాడ్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న విషయైమె అధిష్ఠానానిదే తుది నిర్ణయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకో కూడదని ఏమీ లేదని, పొత్తులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. హైదరాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో టీడీపీకి మంచి ఓటు బ్యాంకు ఉందని ఆయన అభిప్రా యపడ్డారు. భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి పాదయాత్రలు ఎలా ఉంటా యన్నది హైకమాండ్ ప్రకటిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలామంది ఉత్సా హంగా ఉన్నారని… చాలామంది నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని ఉత్తమ్ తెలిపారు. టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన వారిలో కూడా కొందరు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నా రని, పార్టీలో చర్చించి వారి విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటుమన్నారు. హై కమాండ్ గ్రీన్ సిగ్నల్  ఇచ్చిన తర్వాతే వీరి చేరికలు ఉంటాయని ఉత్తమ్ ప్రకటించారు. హైదరాబాద్‌పై తమకు ప్రత్యేక వ్యూహం ఉందని ఉత్తమ్ ఈ సందర్భంగా చెప్పారు. నగరంలోని సెటిలర్స్ నేతలతో మాట్లాడుతున్నామని, ఈసారి కొందరు సీమాంధ్ర నేతలకు టికెట్లు ఇస్తామని, ఇందుకు పార్టీ హై కమాండ్ కూడా అంగీకారం తెలిపిందన్నారు.

నరేంద్ర మోదీపై సెటిలర్లు చాలా ఆగ్రహంగా ఉన్నారని ఉత్తమ్ చెప్పారు. వారికి గతంలో తమపై కోపం ఉండేదని, ఇప్పుడు స్నేహపూర్వకంగానే ఉంటున్నారని తెలిపారు. ఎంఐఎం సీట్లలోనూ గట్టి అభ్యర్థులనే పోటీకి పెడతామని చెప్పారు. ఎంఐఎంకు బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. చాలా మంది బలమైన మైనార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో కూడా స్వీప్ చేస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ఉత్తర తెలంగాణలోనూ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో మంచి స్పందన వస్తోందని చెప్పారు. బస్సు యాత్ర సందర్భంగా జరుగుతున్న సభల్లో ఎలాంటి వివాదాలు లేని స్థానాల్లో పోటీ చేసేవారి పేర్లు ప్రకటిస్తున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ పొందినవారు యుద్ధం చేయాల్సిందేనని చెప్పారు. ఉత్తమ్ మనిషనో, మరొకరి మనిషనో ఈ సారి టిక్కెట్లు ఇవ్వరని తేల్చి చెప్పారు. బలమైన అభ్యర్థులు, ప్రజల్లో మంచి పేరు, పలుకుబడి ఉన్నవారిని ఎంపిక చేస్తామన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →