పవన్ స్పీచ్పై ఉత్కంఠ
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తిరుపతి వేదికగా ఏం మాట్లాడబోతున్నారా? రాజనీయాలు మాట్లాడతారా? సినిమాల గురించి మాట్లాడతారా? ఇవి ఏవీ కావని కులాల గురించి మాట్లాడతారా? అనేది ఉత్కంఠగా మారింది. కాగా ఇద్దరు అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో పవన్ అభిమాని మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కుటుంబాన్ని పరామర్శించటానికి వచ్చిన పవన్ ఇంకా తిరుపతిలోనే ఉన్నారు. ఉన్నట్లుండి పవన్ కల్యాణ్ తిరుపతిలో బహిరంగ నిర్వహించాలని సంచలన నిర్ణయం తీసుకోవడం అందరి చూపు తిరుపతి సభపై పడింది. తిరుపతి సభకు సంబంధించి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం తిరుపతిలోని ఇందిరా గాంధీ గ్రౌండ్ లో సభను పెట్టుకుంటామని పవన్ కల్యాణ్ కోరడం..పోలీసులు అనుమతి ఇవ్వడం చకచకగా జరిగిపోయాయి. శనివారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న అనంతరం బహిరంగసభలో పాల్గొననున్నారు. ఆకస్మికంగా ఆయన తిరుపతిలో బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
అభిమానులకు సందేశం ఇవ్వటంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను…జనసేన భవిష్యత్ కార్యాచారణను కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పవన్ సడన్ గా తిరుపతిలో బహిరంగ సభ నిర్ణయం తీసుకోవటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలపై పవన్ తన వైఖరి చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. చూడాలి మరి సభలో పవన్ ఎలాంటి సంచలన ప్రకటనలు చేయనున్నారో.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.