అద్భుతాలు చేద్దాం!
జపాన్ సంస్థలకు చంద్రబాబు పిలుపు
అమరావతిని నిర్మించే బాధ్యత కూడా భవనాలను డిజైన్ చేసిన వారే తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ సంస్థలను కోరాడు. జపాన్ సంస్థలు అమరావతిని రెండో ఇల్లుగా భావించి రెండో టోక్కో నగరంగా అభివృద్ధి చేయాలన్నారు. జపాన్ వాణిజ్య మంత్రి టకాగి నేతృత్వంలో 80 మందికి పైగా వివిధ సంస్థల ప్రతినిధులు చంద్రబాబుతో సమావేశమైన సందర్భంగా బాబు పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ జపాన్‌కు చెం దిన మాకీ సంస్థ ఆధ్వర్యంలో అమరావతి భవనాల డిజైన్ జరగనున్నట్లు వెల్లడించారు. ఏపీ నుంచే జపాన్, చైనాలకు బౌద్ధం వ్యాపించిం దని ఆయన గుర్తుచేశారు. సాంకేతికతలో జపాన్ ముందుందని, ఆంధ్రప్రదేశ్ నేర్చుకునే దశలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. జపాన్ సహకరిస్తే ఇక్కడ అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. త్వరలో విజయవాడ నుంచి నేరుగా టోక్యోకు విమాన సర్వీసులు నడుపుతామని ఆయన తెలిపారు.
జపాన్, ఏపీ మధ్య మంచి సంబంధాలున్నాయని చంద్రబాబు అన్నారు. రియల్ టైమ్ స్మార్ట్ మీటర్ రీడింగ్ డివైస్ అభివృద్ధి ప్రాజెక్టును ఫ్యూజీ కంపెనీకి చంద్రబాబు అప్పగించారు. దీంతో అమరావతిని స్మార్ట్ క్యాపిటల్‌గా మార్చేందుకు మైక్రో గ్రిడ్ సిస్టమ్ అభివృద్ధి చేస్తామన్న ఫ్యూజీ ఎల్రక్టిక్ కంపెనీకి సహకరించాలని చంద్రబాబు అన్నారు. ఫైబర్ కేబుల్ వ్యవస్థలో స్మార్ట్ మీటర్ల అభివృద్ధికి సెప్టెంబరు నాటికి పూర్తిచేయాలని ప్యూజీ కంపెనీకి చంద్రబాబు సూచించారు. జపాన్‌కు చెందిన వెయ్యి కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టనున్నాయని చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది 150 జపాన్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడతాయని చంద్రబాబు మీడియాకు వివరించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.