
వాట్సాప్ వినియోగదారులు రోజు రోజుకు పెరుగుతుండడం వాట్సాప్ సంస్థ యాజమాన్యం కూడా కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. కొత్త ఫీచర్లను ప్రవేశ పెట్టడంలో ఇటీవల కొంత దూకుడును కూడా ప్రదర్శిస్తోంది. మొన్నీమధ్యనే మనం పంపిన మెసేజ్‌ను ఎవరికీ కనిపించకుండా డిలిట్ చేసేలా ఫీచర్‌ను ప్రవేశపెట్టి అందరి మన్ననలు పొందిన వాట్సాప్ ఇప్పుడు తాజాగా భారీ స్థాయిలో మార్పిడి జరిగే స్పాం నిరోధానికి వాట్సాప్ చర్యలకు ఉపక్రమించింది. వేరే వ్యక్తులు ఓ మెసేజ్‌ను ఫార్వర్డ్ చేసినా, లేదంటే వచ్చిన మెసేజ్‌ను సదరు వినియోగదారుడే ఇతరులకు ఫార్వర్డ్ చేసినా ‘ఫార్వర్డెడ్ మెసేజ్’ అని దానిపై టాగ్ కనిపించనుంది. వాట్సాప్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే డబ్ల్యూఏబీటాఇన్ఫో ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ వీ2.18.67లో మాత్రమే ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నట్టు అందులో పేర్కొంది. ఇక, దాంతో పాటుగా విండోస్ ఫోన్ బీటా వెర్షన్లో స్టిక్కర్లను పొందుపరిచిన వాట్సాప్.. ఇప్పుడు ఆండ్రాయిడ్ వెర్షన్లలోనూ ఆ ఫీచర్లను పొందుపరిచింది. మరోవైపు ఇటీవలే గ్రూప్ డిస్క్రిప్షన్ ఫీచర్‌నూ ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్ బీటా వెర్షన్లలో పొందుపరిచింది. ఫార్వర్డెడ్ మెసేజెస్, స్టిక్కర్లతో పోలిస్తే.. గ్రూప్ డిస్క్రిప్షన్ ఫీచర్ వినియోగదారులందరికీ కనిపిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా గ్రూపులోని సభ్యులెవరైనా సరే గ్రూప్ డిస్క్రిప్షన్‌ను ఎడిట్ చేసే వెసులుబాటును కల్పించింది వాట్సాప్.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.