అమితాబ్ రిక్వెస్ట్ ని తోసిపుచ్చిన క్రిస్ గేల్..
బాలీవుడ్ మేటి యాక్టర్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఆయన వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ను తన ఇంటికి ఆహ్వనించారు. మర్యాద పూర్వకంగా ఇంటికి పిలిచి అతిథి మర్యాదలు చేశారు. ఆయనకు ఘనమైన విందు ఇచ్చారు. భారత్ తో సెమీస్ మ్యాచ్ సందర్భంగా క్రిస్ గేల్ ముంబై వచ్చాడు. దీంతో క్రిస్‌ను కలిసిన బిగ్ బి ఆయన్ను డిన్నర్‌కు ఆహ్వానించారు. ఇందులో భాగంగా అమితాబ్.. గేల్ తో మాట్లాడుతూ ఓ రిక్వెస్ట్ చేశాడు. అయితే బిగ్ బీ రిక్వెస్ట్ ని గేల్ అతి సున్నితంగా తిరస్కరించాడు.
అంతేకాదు.. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ రాత్రి తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచాడు గేల్.అమితాబ్ నిజమైన లెజెండ్. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మీ ఇంటి ఆతిథ్యానికి, మీరు ఇచ్చిన పుస్తకాలకు కృతజ్ఞతలు. నేను 100 కొట్టాలని కోరుకుంటూనే.. భారత జట్టు గెలవాలంటున్నారు అమితాబ్. కానీ నేను మాత్రం 100 కంటే విండీస్ విజయమే కావాలనుకుంటున్నానని అందులో రాశాడు. ఇటీవల తన అభిమానాన్ని చాటుతూ గేల్ ఓ బ్యాట్‌ను అమితాబ్‌కు బహుమతిగా పంపించాడు.ఇక.. గేల్ కామెంట్‌పై అమితాబ్ ట్విటర్లో స్పందించారు. ‘నా అభిమానో? కాదో? తెలియదు. కానీ ఎంతో మర్యాదస్తుడు అని ప్రశంసించారు. గురువారం భారత-వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్‌లో నా పొగడ్తలకు చెల్లింపులు చేస్తాడని భావిస్తున్నా అంటూ బిగ్ బి రీ ట్వీట్ చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.