Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

when will sachivalayam complete?

By   /  August 11, 2016  /  Comments Off on when will sachivalayam complete?

    Print       Email

sachivalayamస‌చివాల‌యం ఎప్ప‌టికి పూర్తి అవుతుందో?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ స‌చివాల‌య ఉద్యోగులంద‌రూ జూన్ 29వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌కు వెల‌గ‌పూడికి చేరుకుని అక్కడి నుంచి విధులు నిర్వ‌హించాల‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే స‌చివాల‌య నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. నిర్మాణాలు జ‌రుగుతూనే ఉన్నాయి. అవి ఎప్ప‌టికి పూర్తి అవుతాయో ఏమో కూడా తెలియ‌డం లేదు. కాగా ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేసేందుకు కాను బాబు స‌ర్కార్‌  టెండర్ లో పేర్కొన్న దానికంటే 30 కోట్ల రూపాయలపైనే అధిక మొత్తం చెల్లించటానికి అంగీకరించింది.  ఇది ఎందుకు అంటే వేగంగా పనిచేయాలి కాబట్టి…ఆ మాత్రం ఇవ్వొద్దా? అన్నారు. అందరూ సరే అన్నారు. పోనీ చెప్పినట్లు వేగంగా రెడీ అయిందా అంటే?. జూన్ 28 పోయింది..జూలై..ఆగస్టు కూడా పూర్తి కావస్తోంది. రెడీ సంగతి దేవుడెరుగు. అప్పుడే మళ్ళీ ‘రిపేర్’ వచ్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు…మంత్రి నారాయణల ‘విజన్’ అద్బుతం అంటూ అధికారులు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. దాదాపు 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రెడీ చేస్తున్న వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మంత్రులకు చిన్న చిన్న గదులే కేటాయించారు. ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మాత్రమే విశాలమైన ఆఫీసు కేటాయించారు.

తర్వాత మంత్రి నారాయణ, యనమల లాంటి వారికి ఓకే. కానీ మిగిలిన మంత్రులకు మాత్రం దారుణంగా చిన్న చిన్న గదులు కేటాయించారు. దీనిపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటంతో వ్యవహారం కాస్తా మళ్లీ మొదటికి వచ్చింది.ఇప్పుడు కేటాయించిన దాని ప్రకారం మంత్రి..పీఎస్,,పీఏలు అందరూ ఒకే గదిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వందల కోట్ల రూపాయల పెట్టి నిర్మిస్తున్న భవనాల్లో మంత్రులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా డిజైన్ చేశారు. దీంతో ఇఫ్పటికే రెడీ అయిన బ్లాక్ ల్లోని మంత్రుల ఛాంబర్లను పగలగొట్టి మళ్లీ మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం ఒక్కో మంత్రికి 650 అడుగుల స్థలం మాత్రమే ఉండగా..ఇప్పుడు దాన్ని రీడిజైన్ చేసి పెంచుతున్నారు. అన్ని బ్లాక్ ల్లోనూ ఈ మార్పులు చేయాల్సిన పరిస్థితి. మంత్రి నారాయణ పొద్దున లేస్తే వెలగపూడిలోనే ఉండి..తానే అంతా కట్టిస్తున్న తరహాలో కలరింగ్ ఇచ్చారని..చివరకు పరిస్థితి ఇది అని ఓ సీనియర్ మంత్రి ఆగ్రహం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →