Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Where is Goldman’s shirt?

By   /  July 18, 2016  /  Comments Off on Where is Goldman’s shirt?

    Print       Email

GOLD_MAN_HUGEఆ చొక్కా ఏమైంది?

 

InCorpTaxAct
Suvidha

 

 

బంగారు చొక్కావేసుకుని తిరిగే గోల్డ్‌మెన్ ద‌త్తాత్రేయ  ఫుగేను హ‌త్య చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న  వేసుకున్నా చొక్కా ఏమైంది? ఎక్క‌డుంది? అది సుర‌క్షితంగానే ఉందా? ఎవ‌రైనాఎత్తుకెళ్లారా? అన్న సందేహం ఇప్పుడు అంద‌రిలోనూ మెద‌లుతోంది. కాగా చించ్వాడ్‌లోని రాన్కా జ్యూవెల‌ర్స్ వ‌ద్ద సుర‌క్షితంగా ఉంది అని ఫుగే త‌న‌యుడు హ‌త్య‌కు ప్ర‌త్య‌క్ష సాక్షి అయిన శుభం పేర్కొన్న‌ట్లు చెబుతున్నా రాన్కా జ్యూవెల‌ర్స్‌కు ఆ చొక్కాను ఎందుకు అప్పగించారనే కారణాన్ని మాత్రం శుభం వెల్లడించలేదు. అయితే రాన్కా జ్యూయెలర్స్‌ యజమాని తేజ్‌పాల్ రాన్కా మాత్రం ఈ విషయాన్ని ఖండించారు. ఆ చొక్కా మా దగ్గర ఎందుకు ఉంచుకుంటాం ఫుగే నుంచి ఆర్డర్ రావడంతో మూడునాలుగేళ్ల క్రితం ఆ చొక్కా తయారుచేశాం. అది పూర్తి కాగానే ఆయనకు అప్పగించేశాం. అక్కడితో మాకు అప్పగించన పని ముగిసింది అని ఆయ‌న చెబుతున్నారు.

తాము వస్తువులను కుదవ పెట్టుకునే వ్యాపారం చేయడం లేదని, త‌మ‌ది కేవ‌లం అమ్మకాలు కొనుగోళ్ల బిజినెస్ మాత్ర‌మే చేస్తున్నామ‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. ఇదే విషయాన్ని మరోసారి శుభంను అడిగినప్పుడు.. చొక్కా వివరాలు తమ కుటుంబసభ్యులను అడిగి చెబుతానని, చివ‌రిసారిగా తన తండ్రి రెండేళ్ల క్రితం ఆ షర్ట్ వేసుకున్నాడని, ఇంచు మించు అప్పుడే అప్పుడే తన తండ్రికి గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ చేయించుకోవాల్సి వచ్చిందని అతనుచెప్పాడు.కాగా ఫుగే సన్నిహిత బంధవుల కథనం మరోలా ఉంది. మనీలెండర్ కూడా అయిన ఫుగేకు చిట్‌ఫండ్ వ్యాపారం కూడా ఉందని అయితే ఆయన అప్పుల్లో కూరుకుపోయి ఇన్వెస్టర్లకు లక్షల్లో బాకీ పడ్డాడని వారంటున్నారు. బహుశా అప్పుల కారణంగా ఆ షర్ట్ అమ్మేసి ఉండొచ్చు.

కొద్దికాలంగా ఆ చొక్కా గురించి కానీ ఆ చొక్కాను ఆయన ధరించినట్టు కానీ మా దృష్టికి రాలేదు అని ఫుగే కుటుంబ సన్నిహితుడొకరు తెలిపారు. బంగారు చొక్కా ఆచూకీ వ్యవహారం చెప్పడం ఫుగే కుటుంబసభ్యులకు ఇష్టంలేకపోయి ఉండొచ్చని మరో సన్నిహితుడు అభిప్రాయపడ్డారు. అయితే స్వర్ణవ్యాపారి రాన్కా దీనిపై మరితం లోతుగా విశ్లేషిస్తూ ఆ షర్ట్‌ను చెడగొట్టించి ఉండొచ్చని ఆ పని చేయడం చాలా సులభమని అంటున్నారు. ఏది ఏమైనా గోల్డ్ ష‌ర్ట్ మిస్ట‌రీ నేటివ‌ర‌కు అంత‌ప‌ట్ట‌కుండా ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →