హన్సిక ఎక్కడ?
హన్సిక ఏం చేస్తోంది ? ఎక్కడ ఉంది ? అన్న సందేహాలు అందరిలోను నెలకొన్నాయి. చాలా మంది హన్సిక అభిమానులైతే హన్సిక గురించి తెలుసుకునేందుకు తెగ ఆరాటపడిపోతున్నారు. హన్సిక తెరపై కనిపించకపోవడానికి అసుల కారణం వేరే ఉందట. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేకపోవడానికి…ఆమె తక్కువగా సినిమాలు చేయడానికి కారణం ఏంటంటే రొటీన్ స్టోరీలతో తెరకెక్కే సినిమాలను ఆమె పక్కన పెట్టేసిందట. కథలో సత్తా ఉన్న సినిమాలు, తనకు పేరొచ్చే సినిమాల్లో మాత్రమే నటించాలని ఆమె డిసైడ్ అయ్యిందట. దీంతో ఆమె ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోందట. హన్సిక ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు. ఇక తమిళ్లో జయం రవితో రొమాన్స్ చేస్తున్న భోగన్ చిత్రం ఒక్కటే ఆమె చేతిలో ఉంది. అయితే కథల ఎంపికలో మరీ మితిమీరిన జాగ్రత్తతో ఉండడంతో గతేడాది వరకు యేడాదికి నాలుగైదు సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు ఒక్క సినిమాకు మాత్రమే పరిమితమైంది. దీంతో ఆమె అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. మరి హన్సిక ఇప్పటికైనా ఆమె అభిమానుల బాధ అర్థం చేసుకుని వరుసగా సినిమాలు ఒప్పుకుంటుందేమో చూడాలి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.