Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

White House responce on Kuchibotla Srinivas death..

By   /  February 25, 2017  /  Comments Off on White House responce on Kuchibotla Srinivas death..

    Print       Email

us-white-houseట్రంప్ విధానాలకు తెలుగు ఇంజనీర్ హత్యకు సంబంధం లేదు.. స్పష్టం చేసిన వైట్ హౌస్ ప్రతినిధి స్పైసర్..

 

InCorpTaxAct
Suvidha

 

 

అమెరికా జాతి వివక్ష కారణంగా ఇద్దరు తెలుగు వారిపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై వైట్ హౌస్ వర్గాలు స్పందించాయి. ఈ దాడికి ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలకు సంబంధం లేదని తేల్చి చెప్పాయి. ట్రంప్ చేపట్టిన విధానాల వల్ల హింస చెలరేగిందని చెప్పడం అర్ధం లేనిదని పేర్కొన్నాయి. ఈ మేరకు వైట్ హౌస్ ప్రతినిధి స్పైసర్ తెలిపారు. ‘ఎవరివైనా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. అయితే ఈ హత్యకు ట్రంప్ విధానాలతో ముడిపెట్టడం మాత్రం సరికాదు’ అని పేర్కొన్నారు.

శ్వేతజాతీయుడు ఒకడు భారత ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల, మాదసాని అలోక్ రెడ్డి, ఓ అమెరికన్ పై కాల్పులకు తెగబడ్డాడు. ఈ సందర్భంగా అతను ‘మాదేశం విడిచి వెళ్లిపోండి.. ఉగ్రవాది’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. దీనిపై ప్రశ్నించినప్పుడు స్పైసర్ తనదైన శైలిలో పైవిధంగా స్పందించారు. ఇక ఈ ఘటనపై భారత ఎంబసీ అధికారులు తమను కలిశారని అన్నారు. వేగంగా విచారణ చేపట్టాలని కోరారని తెలిపారు. ఈ కేసు విచారణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత ఎంబసీకి అందజేయాలని భారత అధికారులు కోరారని చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →