పన్నీరు సెల్వం- పళనీస్వామి చర్చల వెనుక శశికళ హస్తం ..? మునుస్వామి సంచలన వ్యాఖ్యలు..
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. శశికళ, దినకరన్ లను పార్టీ నుంచి పక్కన పెట్టే దిశగా పళనీ స్వామి వర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని వార్తలు వెలువడ్డాయి. ఇంచుమించుగా అంతా అయిపోయిందని ప్రచారం సాగింది. త్వరలో ఇరువురు నేతలు కలిసి కలిపిసోయినట్లుగా ప్రకటన చేస్తారని కూడా ముమ్మర ప్రచారం సాగింది. అయితే ఇప్పటివరకు వారి మధ్య సాగిన చర్చలు కాస్తా బెడిసికొట్టాయని కొత్త ప్రచారం మొదలైంది.
దీనికితోడు పన్నీరు సెల్వం వర్గానికి చెందిన మునుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ సీన్ అంతా జైలు నుంచి శశికళే నడిపిస్తున్నారని తమకు అనుమానం ఉందని అన్నారు. శశికళను, దినకరన్ ను పార్టీ నుంచి అధికారికంగా తొలగించాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో రెండు వర్గాల విలీనం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. తాము ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని అన్నారు. కేవలం జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని మాత్రమే కోరుతున్నామని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.