Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Who is prominent in combined states? Chandra Babu or KCR?

By   /  July 10, 2016  /  Comments Off on Who is prominent in combined states? Chandra Babu or KCR?

    Print       Email

AP CM N. Chadrababu Naidu with C M of Telangana K. Chandrashekhar Raoఈవోడీబీలో అగ్ర‌స్థానం ఎవ‌రిది?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి విడిపోయిన త‌ర్వాత తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో అన్నింటిలో పోటీప‌డుతూనే ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల అమ‌లులో ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా పోటీ ప‌డి ప‌నిచేస్తున్నారు. అయితే ఈ పోటీలో ప్ర‌స్తుతానికి తెలంగాణ రాష్ట్రం కొంత ముందు ఉండ‌గా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వెనుక ప‌డింది. తాజాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ)లో ఆగ్రస్థానం దక్కించుకునేందుకు తెలంగాణ, ఏపీలు పోటీ పడుతున్నాయి. ఈ పోటీ ఎంత వరకు వచ్చిందంటే పోలీసు కేసులవరకు వెళ్లింది. తాము చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాఫీ కొట్టిందంటూ తెలంగాణ ప్రభుత్వం సైబర్ క్రైం పోలీస్‌లకు ఫిర్యాదు కూడా చేసిన విషయం తెలిసిందే!. దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అగ్ర స్థానంలో తెలంగాణ ఉంటుందా!? ఆంధ్రప్రదేశ్ ఉంటుందా!? అన్న రసవత్తర పోటీ నెలకొంది. ఈ విషయాన్ని ప్రస్తుతం ఏ శాఖ ఉన్నతా«ధికారులను కదిలించినా ఇదే ప్రశ్న! ఆగస్టు ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం తుది ర్యాంకులను అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న నేప‌థ్య‌లో ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌లు, అధికారుల్లో ఉత్కంఠ నెల‌కొంది. నిజానికి, ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం బిజినెస్ సంస్కరణల యాక్షన ప్లాన్ పేరుతో ఈవోడీబీని అమలు చేస్తోంది. 340 పారామీటర్లు ఆధారంగా 100 మార్కులు ఇచ్చింది.

యూజర్ ఫ్రెండ్లీ సేవలు అందించడానికి వీలుగా రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. రెండు దశల్లో రాష్ట్రాలకు ఈ ర్యాంకులను ప్రకటిస్తారు. తొలుత ఆయా రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల్లో కల్పించే సౌకర్యాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, భూ విధానం, పర్యావరణ అనుమతులు, వ్యాట్ రిజిస్ట్రేషన్ తదితరాలు. డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసిన విధానాన్ని బట్టి తొలి ర్యాంకు ఇస్తారు. ఆ తర్వాత, సమర్పించిన డాక్యుమెంట్లకు సంబంధించి ఆయా రాష్ట్రాలు వివరణలు ఇవ్వాలి. అంటే, దరఖాస్తులను పరిష్కరించడానికి, అనుమతులు ఇవ్వడానికి సెంట్రలైజ్డ్ హెల్ప్‌లైన్ నెంబరు ప్రవేశపెట్టామా? లేదా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకుంటే పర్యావరణ అనుమతులను మూడు గంటల్లోనే ఇస్తారా? లేదా ఒక్క రోజులోనే వ్యాట్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేస్తాం వంటి వాటికి సంబంధించి సమగ్ర వివరాలు అందించాల్సి ఉంటుంది. ఆ వివరాల ఆధారంగా తుది ర్యాంకులను కేటాయిస్తారు. దరఖాస్తులను అప్‌లోడ్ చేయడానికి సంబంధించి గ‌త మూడు రోజుల క్రిత‌మే గడువు ముగిసింది.

అప్పటికి ఉత్తరాఖండ్ 53.39 శాతం పాయింట్లతో అగ్ర స్థానంలో ఉంటే, 51.93 శాతం పాయింట్లతో తెలంగాణ రెండో స్థానంలో, 51.76 శాతం పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. తుది ర్యాంకుకు తెలుగు రాష్ట్రాల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. తెలంగాణలో ప్రధానంగా రిజిస్ట్రేషన్ల శాఖ 11కు పైగా సేవలను సరళతరం చేయగా.. రెవెన్యూ శాఖ కూడా మరింత ఉదారంగా సేవలను అందించడానికి కార్యాచరణ రూపొందించింది. ఈ రెండు శాఖలకూ సంబంధించి భూముల మ్యుటేషన్‌తో పాటు వెబ్‌సైట్‌లో నమూనా సేల్ డీడ్ పెట్టడం, ఈ-స్టాంప్ విధానం, రికార్డుల డిజిటైజేషన్, ల్యాండ్ రికార్డుల అనుసంధానం, అన్ని రకాల డాక్యుమెంట్లు అందుబాటులో ఉంచడం, ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్ల పరిశీలన వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. భూముల మ్యుటేషన్ చార్జీలను మీసేవ వంటి కేంద్రాల్లో చెల్లించడం, ఈ-పట్టాదార్ పాస్ పుస్తకం -కమ్- టైటిల్ డీడ్, భూముల వివరాలన్నీ మాభూమి వెబ్‌సైట్‌లో పొందుపరచడం వంటి సేవలను తెలంగాణ ప్రభుత్వం సుల‌భ‌త‌రం చేసింది. ఈ నేప‌థ్యంలో ఈవోడీబీలో అగ్ర‌స్థానం ఎవ‌రిది అనే విష‌యం తెలుసుకోవాలంటే మ‌రో నెల‌రోజులు ఆగాల్సిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →