Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Who is speaking truth? BJP or TDP

By   /  May 2, 2016  /  Comments Off on Who is speaking truth? BJP or TDP

    Print       Email

tdp-bjpఎవ‌రు చెప్పేది నిజం?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ, భార‌తీయ జ‌న‌తా పార్టీలు అంత చేశాం.. ఇంత చేశామ‌ని చెబుతున్నాయి. ఏపీ అభివృద్ధికి వేల కోట్లు ఇచ్చామ‌ని బీజేపీ చెబుతుంటే లేదు.. లేదు మాకు అంత ఇవ్వ‌లేద‌ని టీడీపీ అంటోంది. మా ప‌థ‌కాల‌ను కూడా మీ ప‌థ‌కాలుగా గొప్ప‌లు చెప్పుకుంటూ.. రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చిన నిధుల‌ను కూడా మీ ప్ర‌చారానికి వాడుకుంటున్నార‌ని బీజేపీ ఆరోపిస్తుంటే.. మీరు ఏమి ఇచ్చార‌ని మాట్లాడుతున్నార‌ని టీడీపీ ఎదురు ప్ర‌శ్నిస్తుంది. ఇటీవ‌ల ప‌రిణామాలు చూస్తుంటే టీడీపీ బీజేపీ మ‌ధ్య గ్యాప్ పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. హోంశాఖ స‌హాయ మంత్రి హ‌రిభాయ్ చౌద‌రి మాట్లాడుతూ ఏపీ ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేద‌ని చెప్ప‌డంతో ప్ర‌తిప‌క్షాలు టీడీపీపై దుమ్మెత్తి పోస్తున్నాయ‌ని, మ‌నం ఇలాగే ఉంటే మాత్రం ప్ర‌జ‌లు మ‌న‌ల్ని ఎవ‌రూ న‌మ్మ‌ర‌ని, బీజేపీపై మ‌నం ఒత్తిడి పెంచ‌డంతో పాటు లేఖ‌లు రాయాల‌ని నిన్న జ‌రిగిన టీడీపీ కేబినెట్ మీటింగ్‌లో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

అయితే కొత్త రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్ల నిధులు ఇచ్చామని పోలవరానికి రూ. 7100 కోట్ల నిధులు సమకూర్చి 2018 నాటికి ఒక దశ పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటామని పది జాతీయ విద్యా సంస్ధలను ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి రాజ్యసభలో ప్రకటించగా తమకు ఇంతవరకు రూ. 850 కోట్లు మాత్రమే అందిందని రాష్ట్రప్రభుత్వం అంటోంది. పోలవరం ప్రాజెక్టుకు రూ. 4000 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గత ఫిబ్రవరిలోనే కేంద్రానికి వినతిపత్రం స‌మ‌ర్పించ‌గా బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయించారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయగా నాబార్డు నుంచి నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పినా ఇంతవరకు ఫలితం శూన్యం. ఇలాంటి వాస్త‌వాల‌న్నీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకు శ్వేత‌ప‌త్రాలు కూడా విడుద‌ల చేయాల‌ని యోచిస్తోంది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →