చిరు సరసన బాలీవుడ్ భామ?
మెగాస్టార్ చిరంజీవి చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్న150వ సినిమాలో ఆయన పక్కన నటించే హీరోయిన్ ఎవరు? గతంలో అనుకున్న హీరోయిన్లు ఎవరూ కాదా? హీరోయిన్ విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోంది? దీనికి నిర్మాత రామ్చరణ్ కారణమా? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే చిరు పక్కన హీరోయిన్ గా నటించేందుకు అనుష్క – నయనతారల పేర్లు వినిపించాయి. కానీ.. తమకు ఆఫర్ రాలేదని ఇప్పటికే ఈ ఇద్దరు భామలు తేల్చి చెప్పేశారు కూడా. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. పాటల కోసం గ్లామర్ డోస్ కోసం అంతే. అందుకే ఈ రోల్ కి బాలీవుడ్ నుంచి ఓ టాప్ స్టార్ ను తీసుకొస్తే.. విజువల్ గా అదిరిగిపోతుందని.. సినిమాకు అదనపు వాల్యూ అవుతుందని నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నాడట.
ఇప్పటికే కొందరు బాలీవుడ్ భామలతో డిస్కషన్స్ కూడా పూర్తి కాగా.. అందులోనుంచి ఇద్దరితో ఫైనల్ టాక్స్ జరుగుతున్నాయని అంటున్నారు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ రామ్ చరణ్ కాబట్టి.. ఖర్చు విషయంలో రాజీపడే సమస్యే లేదు. అందుకే బాలీవుడ్ భామనే తేవాలనే పట్టుబట్టారని తెలుస్తోంది. ఇప్పుడు హీరోయిన్ విషయంలో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసినా.. అగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాకే పేరు అనౌన్స్ చేస్తారట. ఆ ముహూర్తం వచ్చేవారమే అంటున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.