Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Whole BJP is behind LK Advani, says Amith Shah..

By   /  April 21, 2017  /  Comments Off on Whole BJP is behind LK Advani, says Amith Shah..

    Print       Email

modi-amith-shah-1బీజేపీ మొత్తం అద్వానీ వెంట ఉంటుంది: అమిత్ షా

 

InCorpTaxAct
Suvidha

 

 

బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. తీర్పు వచ్చిన తర్వాత బీజేపీ అగ్రనేతలు అందరూ మోదీ నివాసంలో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ మొత్తం మీ వెంటే ఉంటుందని ఆయనకు ధైర్యం చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా అమిత్ షా వెల్లడించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఉమాభారతి అయోధ్య వెళ్ళాలని భావించారు. ఈ విషయం తెలుసుకున్న అమిత్ షా ఆమెను పర్యటన రద్దు చేసుకోవాలని కోరారు. ఇలాంటి సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ సంయమనం పాటించాలని సూచించారు.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్ కె అద్వానీ సహా పలువురు బీజేపీ సీనియర్ నేతలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి సహా మరో 16 మందిని సుప్రీంకోర్టు దోషులుగా తేల్చింది. వీరందరూ ఘటనకు ముందు తమ తమ ప్రసంగాలతో కరసేవకులను రెచ్చగొట్టారని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసు విషయంలో అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. కేసుపై తదుపరి విచారణను లక్నో ట్రయల్ కోర్టులో జరిగేలా ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →