Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Why AP BJP is playing caste politics?

By   /  July 26, 2016  /  Comments Off on Why AP BJP is playing caste politics?

    Print       Email

BJP-Logo-Photosఏపీ బీజేపీలో కుల రాజ‌కీయం

 

InCorpTaxAct
Suvidha

 

 

పార్టీకి కొత్త అధ్యక్షుడిగా వీర్రాజు ఎంపిక దాదాపు పూర్తయిపోయింది. రేపోమాపో ప్రకటనే ఆలస్యమనకుంటున్న సమయంలో వీర్రాజు నియామకం ప్రకటన ఆగిపోయింది. ఈ విధంగా ఇప్పటికి పలుమార్లు ప్రకటన వాయిదా పడినట్లు సమాచారం. తెలుగుదేశం  ప్రభుత్వాన్ని పదే పదే విమర్శిస్తున్న వీర్రాజు అధ్యక్షుడిగా నియమితులైతే ఇబ్బందేనని, అందుకనే ప్రస్తుత అధ్యక్షుడు హరిబాబునే కొనసాగించేవిధంగా టీడీపీలోని ముఖ్యనేత ఒకరు వెంకయ్యనాయడుతో చెప్పటం వల్లే వీర్రాజు నియామకం వాయిదాపడుతున్నట్లు ప్రచారంలో ఉంది. అప్పటి నుండి కొత్త అధ్యక్షుని నియామకం ప్రకటన వెంటనే చేయించాలని ఒక వర్గం, వాయిదా వేయించాలని వ్యతిరేక వర్గం ఒకదానిపై మరొక వర్గం ఎత్తుకుపై ఎత్తులు వేసుకుంటున్నాయి. దాంతో పార్టీలోని అతర్గత రాజకీయాలు అప్పుడప్పుడు రోడ్డున పడుతున్నాయి. దానివల్లే రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుని పగ్గాలు కాపు సామాజిక వర్గానికి చెందిన వీర్రాజుకు చిక్కుతాయా? లేక హరిబాబు చేతిలోనే ఉంటాయా అన్నది సంగ్ధిదంగా మారింది. ఇదిలా ఉంటే కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన  సోము వీర్రాజుకు  పార్టీలోని ఆ సామాజిక వ‌ర్గ నేత‌లు  పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, మంత్రి మాణిక్యాలరావుతో పాటు అనేక మంది మ‌ద్ద‌తుగా నిలుస్తుండ‌గా అధ్య‌క్షుడు హ‌రిబాబు సామాజిక వ‌ర్గానికి చెందిన  కేంద్రమంత్రి వెంకయ్య నాయడు, మంత్రి కామినేని శ్రీనివాస్ రావు అండ‌గా నిలుస్తున్నారు.

దీంతో వెంకయ్యనాయుడు వర్గం ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు పూర్తిస్ధాయిలో పార్టీ తరపున మద్దతు అందిస్తున్నట్లు వీర్రాజు వర్గం జాతీయ నాయకత్వానికి పలుమార్లు ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. ఎంఎల్‌సి హోదాలోనే వీర్రాజు సిఎంపైన, ప్రభుత్వంపైన ఆరోపణలు చేస్తున్నపుడు రేపటి రోజున రాష్ట్రానికి అధ్యక్షునిగా నియమితులైతే ఇరు పార్టీల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయని సోము వ్యతిరేకవర్గం కూడా జాతీయ పార్టీ నేతలతో చెబుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఒక విషయం అర్థ‌మ‌వుతోంది. ఇటు చంద్రబాబుకు అనుకూల వర్గాన్ని, అటు సీఎంకు వ్యతిరేకవర్గాన్ని కూడా జాతీయ నాయకత్వం సమదృష్టితోనే ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →