Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Why BJP is not gaining popularity in South India?

By   /  May 23, 2016  /  Comments Off on Why BJP is not gaining popularity in South India?

    Print       Email

BJP-Logo-Photosబీజేపీ ల‌క్ష్యం అదేనా?

 

InCorpTaxAct
Suvidha

 

 

రెండు తెలుగు రాష్ట్రాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి అంత ప‌ట్టు లేదు. ఎప్పుడు కూడా ప‌ట్టుమ‌ని ప‌ది స్థానాలు గెలుచుకోలేదు. కేంద్రంలో ఎన్నిసార్లు బీజేపీ అధికారంలోకి వ‌చ్చినా ఇక్క‌డ మాత్రం బీజేపీ పుంజుకోవ‌డం లేదు. అందుకే ఈసారి కొత్త వ్యూహంతో ముందుకు వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. అది నిజం చేస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తాజాగా ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించేందుకు పటిష్ట వ్యూహంతో ముందుకెళ్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  2019నాటికి తెలుగు రాష్ట్రాల్లో బలీయమైన శక్తిగా పార్టీని విస్తరిస్తాచెని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో మరింత ఎదుగుతామని తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష స్థాయికి చేరడమే లక్ష్యమని ప్రకటించారు. ఏపీ బీజేపీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారని  రామ్ మాధవ్ అంటున్నారు. ఆంధ్రాలో తాము తెలుగుదేశం పార్టీతో కలిసి అధికారంలో ఉన్నామని అయితే అధికార పార్టీగా ప్రజామన్నన పొందుతూనే బీజేపీని పటిష్టం చేసుకుంటూ విస్తరణకు కృషి చేస్తున్నట్టు చెబుతున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉందని పేర్కొంటూ ఆ శూన్యాన్ని బీజేపీతో పూడ్చేందుకు కృషి చేస్తామంటున్నారు.  ప్రత్యేక హోదాను ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారన్నది వాస్తవమని దీనికి సంబంధించి కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చిస్తున్నారంటున్నారు. రానున్న రెండు మూడేళ్లలో అనేక విధాల సహాయ సహకారాలు అందుతాయంటున్నారు. అయితే ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ అంశం ఒక‌టిఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో కేంద్రం స‌ఖ్య‌త‌తో ఉంటూనే బీజేపీని బ‌లోపేతం చేయాల‌ని చూస్తున్న‌ట్లు  అర్థ‌మ‌వుతోంది. చూడాలి మ‌రి బీజేపీ వ్యూహాలు ప‌లిస్తాయో? లేదో?

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →