Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Why Chandra Babu did that?

By   /  May 11, 2016  /  Comments Off on Why Chandra Babu did that?

    Print       Email

chandrababuబాబు ఎందుకు అలా చేశాడు?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల అన్ని వివాదాల్లో చిక్కు కుంటున్నారు. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బాబు చుట్టూ వివాదాలే. తెలంగాణలో ఓటుకు నోటు ద‌గ్గ‌రి నుంచి అమ‌రావ‌తి రాజ‌ధాని భూ దందా.. ఇసుక మాఫియా.. కాల్‌మ‌నీ సెక్స్ రాకెట్‌.. ఇలా అన్నింటిలోనూ బాబు హ‌స్తం ఉంద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. అంతేకాదు రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అభివృద్ధి లేద‌ని,  పాల‌న స‌రిగా జ‌ర‌గ‌డం లేద‌ని మండిప‌డుతున్నాయి. చంద్ర‌బాబు ఎక్క‌డి వెళ్లినా ప్ర‌త్యేక విమానాళ్లో వెళ్తూ ప్ర‌జా ధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.  ఇలాంటి నేప‌థ్యంలో చంద్ర‌బాబు విశ్రాంతి కోసం విదేశీ టూర్లు పెట్టుకోవ‌డంతో ప్ర‌తిప‌క్షాలు మ‌రో అస్త్రం ఇచ్చిన‌ట్లు అయింది. కేంద్రం రాష్ట్రానికి ప్ర‌త్యేక ఇవ్వ‌మ‌ని చెప్పిన నేప‌థ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి కుటుంబ స‌భ్యుల‌తో విశ్రాంతి తీసుకోవ‌డానికి ఎలా వెళ్తాడ‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ ప్ర‌శ్నిస్తోంది.

కాగా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో తానేమీ చేయనున్నాన్న విషయాన్ని బాబు విస్పష్టంగా చెప్పింది లేదు. ఏపీ భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ అంశంపై చంద్రాబు మరింత స్పష్టత ఇచ్చి ఫారిన్ టూర్ వెళితే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. దాదాపు ఆరు రోజులు రాష్ట్రంలో తాను ఉండని నేపథ్యంలో హోదా విషయంలో కేంద్రం దృష్టికి ఏదైనా డిమాండ్ కానీ.. ఏపీ ప్రజలకు తాను చేయాలనుకుంటున్న కార్యాచరణను మరింత వివరంగా వెల్లడించి ఉంటే బాగుండేదన్న వాదన ఉంది. అలా చేయ‌కుండా వెళ్ల‌డం వ‌ల‌న బాబు ఆరోప‌ణ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. బాబు అలా చేయ‌డం త‌ప్పేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →