Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Why Chandra Babu is supporting Suresh Prabhu from AP? What is his gain??

By   /  May 31, 2016  /  Comments Off on Why Chandra Babu is supporting Suresh Prabhu from AP? What is his gain??

    Print       Email

ap rajyasabhaబాబు `పెద్ద` ట్విస్ట్‌!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఎప్పుడు ఏం చేస్తాడో ఆయ‌న‌కు త‌ప్ప వేరే ఎవ‌రికీ తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎవ‌రికీ స్థానం క‌ల్పించేందుకు ముందునుంచి ఎన్నో ఊహానాగాలు వినిపిస్తున్నా వాట‌న్నంటినీ ప‌టా పంచ‌లు చేస్తూ తాను ఎవ‌రిని నిల‌బెట్టాల‌నుకుంటున్నారో వారికే స్థానం క‌ల్పించారు. మొద‌టి నుంచి సుజ‌నా చౌద‌రిని అంద‌రూ వ్య‌తిరేకిస్తున్నా చంద్ర‌బాబు మాత్రం మ‌ళ్లీ ఆయ‌నే స్థానం క‌ల్పించారు. ఇక‌పోతే టీడీపీ మ‌రో రెండు స్థానాలు ఉండ‌గా ఒక‌టి మీడియా అధిప‌తుల‌కు ఇస్తార‌ని అంద‌రూ భావించారు. అందులో భాగంగానే ఎన్టీవీ, టీవీ5, టీవీ9, ఏబీఎన్ ఛాన‌ళ్ల అధిప‌తులు బాబును నిత్యం ప్ర‌స‌న్నం కూడా చేసుకోవ‌డం మొద‌లు పెట్టారు. అయితే వాళ్ల‌ల్లో ఎవ‌రికీ ఇవ్వ‌కుండా షాక్ ఇచ్చారు. అంతేకాదు నిన్నటి వ‌ర‌కు ఒక‌టి సుజ‌నా చౌద‌రికి అని, మ‌రొక‌టి ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన పుష్ప‌రాజ్‌కు ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంత‌లోనే మాట మార్చి మ‌రొక‌రికి ఇచ్చారు.

ఉన్న‌ట్లుండి తెర‌పైకి వ‌చ్చిన మాజీ మంత్రి టీజీ వెంక‌టేష్ రాజ్య‌స‌భ‌కు పంపిస్తున్న‌ట్లు బాబు ప్ర‌క‌టించారు. దీంతో టీడీపీ నేత‌ల‌తో పాటు ఆశావ‌హులు ఖంగుతున్నారు. బాబు మ‌నుసులో ఏముందు క‌నుక్కోవ‌డం చాలా క‌ష్ట‌మ‌ని వారు మాట్లాడుకోవ‌డం క‌నిపించింది. కాగా టీడీపీ మూడో అభ్య‌ర్థికి  ప్ర‌స్తుత కేంద్ర రైల్వే మంత్రిసురేశ్ ప్ర‌భుకు కేటాయించారు. ఆయ‌న నేడు నామినేష‌న్ కూడా వేయ‌బోతున్నారు. ఇక‌పోతే నాల్గ‌వ అభ్య‌ర్థిని కూడా రాజ్య‌స‌భ బ‌రిలో నిల‌పాల‌ని టీడీపీ యోచిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. అందులో భాగంగానే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో స‌మావేశ‌మ‌య్యారు. వాళ్ల స‌ల‌హాలు.. సూచ‌న‌లు తీసుకున్నారు. కాగా నాల్గ‌వ అభ్య‌ర్థిని నిల‌బెట్టేది లేనిది నేడు తేల‌నుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →