Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Why Chandrababu Naidu is not getting with Slippers? – YSRCP

By   /  June 4, 2016  /  Comments Off on Why Chandrababu Naidu is not getting with Slippers? – YSRCP

    Print       Email

tdp flag with ycp flag newబాబును చెప్పుతో ఎందుకు కొట్టొద్దు?

 

InCorpTaxAct
Suvidha

 

 

రైతు భ‌రోసా యాత్ర‌లో  భాగంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టిస్తూ బాధిత కుటుంబ స‌భ్యుల‌ను భ‌రోసా క‌ల్పిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. “ గుడినీ – గుళ్ళో లింగాన్నీ మింగేసే అవినీతిపరుడు చంద్రబాబు.. పెద్దలు – పిల్లలు అందరిచేతా ఎక్కడ పడితే అక్కడ నవనిర్మాణ దీక్షలు చేయిస్తున్నారు చంద్రబాబు.. ఆయన దీక్షల్లో ఉన్న అంశాలు నిజమవ్వాలీ అంటే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసి చెప్పులతో కొట్టాలి.. అప్పుడే ఈ అరాచకం – అవినీతి ఆగుతాయి”  అంటూ అనంతపురం జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ అన్న మాట‌లు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. దీనిపై టీడీపీ నేత‌లు సీరియ‌స్ అవుతున్నారు.  పట్టణాల్లో ర్యాలీలు తీయ‌డంతో పాటు జగన్ క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. జగన్ ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టారు. క్రిమినల్ జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జగన్ కు మతి భ్రమించిందని ఫ్రస్ట్రేషన్ తో ప‌లువురు మంత్రులు విమ‌ర్శించారు.

టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేత‌లు, ఎమ్మెల్యేలు కౌంట‌ర్ అటాక్ ఇవ్వ‌డంతో పాటు జ‌గ‌న్ అన్న మాట‌ల‌ను స‌మ‌ర్థించారు. ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌లేద‌ని, బాబు ప్ర‌జ‌ల్లోకి వ‌స్తే క‌చ్చితంగా ప్ర‌జ‌లుచెప్పుల‌తో కొడ‌తార‌ని, అదే విష‌యాన్ని త‌మ అధినేత చెప్పారు. చంద్ర‌బాబును ఎందుకు చెప్పుతో కొట్ట‌కూడ‌దో చెప్పాలంటే టీడీపీ నేత‌ల‌పై ఎదురుదాడి చేశారు. కాగా చంద్ర‌బాబును చెప్పుల‌తో కొడ‌తారంటూ వైయ‌స్ జ‌గ‌న్ రెండో రోజూ కూడా అన‌డం.. ఆ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌జ‌ల నుంచి భారీ స్పంద‌న వ‌స్తుండ‌డంతో  వాటిని ఎలా ఖండించాలో అర్థం కాక టీడీపీ డైల‌మాలో ప‌డిపోయింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →