Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Why don’t you ask Central Government, Dont blame me: Chandrababu Naidu

By   /  February 22, 2018  /  Comments Off on Why don’t you ask Central Government, Dont blame me: Chandrababu Naidu

    Print       Email

కేంద్రాన్ని అడగడం మానేసి నన్ను తిడుతున్నారు: సీఎం చంద్రబాబు

 

InCorpTaxAct
Suvidha

 

 

 

ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కొందరు ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీయడం మానేసి తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కొన్ని పార్టీలకు చెందిన నేతలకు ఇదే రోజు వారీ ప్రక్రియ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండలో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ మాత్రం సాయం అందడం లేదని వాపోయారు. వాస్తవానికి కేంద్రం చేయాల్సిన సాయం చేసి ఉంటే ఏపీ మరింత అభివృద్ధి చెంది ఉండేదని అన్నారు.

‘ఓ వార్తా పత్రిక ఉంది.. ఆ పేపరు పేరు నేను చెప్పలేను మీ అందరికి తెలుసు.. అసత్యాలు తెగరాసి వారు అలసిపోతున్నారు.. ఆ పేపరుని ఎవరైనా నమ్మే అవకాశం ఉందా?’ అంటూ వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వం ఏదో కొద్దిగా నిధులు కేటాయించి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏపీని హేతబద్ధత లేకుండా విభజించింది అని అన్నారు. కేంద్రానికి ఏపీకి సాయం అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. తాము 2019 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →