Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Why Kohli dropped Gayle?

By   /  May 9, 2016  /  Comments Off on Why Kohli dropped Gayle?

    Print       Email

Gayleగేల్‌ను అందుకే తీశారా?

 

InCorpTaxAct
Suvidha

 

 

విధ్వంస‌క‌ర బాట్స్‌మెన్ గేల్ ఉన్న‌ట్టుండి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ నుంచి ఎందుకు దూర‌మైన‌ట్లు? గేల్ దూర‌మ‌య్యాడా? అత‌న్ని టీం దూరం పెట్టిందా? అంటే చెప్ప‌డం కొంచెం క‌ష్ట‌మే.  అయితే గేల్ ఇటీవ‌ల స‌రిగా ఆడ‌డం లేద‌నే గేల్‌ను ప‌క్క‌న పెట్టార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్న‌నేప‌థ్యంలో ఒక‌వేళ అలా జ‌రిగి ఉంటే కెప్టెన్ విరాట్ కోహ్లీది సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌య‌మే అని చెప్పాలి. కాగా దీనిపై విరాట్ స్పందిస్తూ తాము స్టార్ బ్యాట్స్‌మన్ గేల్‌కు రెస్ట్ ఇవ్వలేదని, డ్రాప్ చేశామ‌ని చెప్పాడు. ఆల్ రౌండర్( హిట్టర్ఆఫ్ స్పిన్నర్) ట్రావిస్ హెడ్‌ను గేల్ స్థానంలో తీసుకున్నామని వెల్లడించాడు. గేల్‌ను జట్టులోనే ఉంచడం కోసం మరో ఆటగాడిని పక్కన పెట్టయ్యవచ్చుకదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కోహ్లీ తెలివిగా సమాధానం చెప్పాడు. ఓపెనర్ రాహుల్ ఫాంలో ఉన్నాడని చెప్పాడు. అదే సమయంలో డీవిలియర్స్‌కు కీపింగ్ అప్పగించడం ద్వారా గేల్‌ను ఆడించవచ్చు కదా అన్నప్పుడు ఆయనపై ఒత్తిడి ఎక్కువ అవుతుందన్నాడు. మొత్తానికి గేల్‌ను తొలగించడం వెనుక పెద్ద గేమ్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోందని క్రీడా పండితులు చెబుతున్నారు. గేల్‌ ఐపీఎల్ ఆరంభం నుంచే సరిగా ఆడటం లేదు. అయితే ఒకసారి ఫాంలోకి వస్తే గేల్‌ను ఆపడం ఎవరి తరమూ కాదు. ఇటీవల కుమార్తె పుట్టిందనే కారణంతో గేల్‌కు విశ్రాంతి ఇచ్చినట్లుగా తొలుత చెప్పారు. తాజాగా డ్రాప్ చేశామని వెల్లడించ‌డం గ‌మ‌నార్హం. ఏది ఏమైనా గేల్ దూరం కావ‌డం ఆ జ‌ట్టుకు క‌లిసి వ‌స్తుందో? మ‌రింత ఇబ్బంది పెడుతుందో చూడాలి?

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →