నితీశ్ ప్రమాణ స్వీకారానికి మోదీ రాకపోవడానికి కారణం ఏమిటి..?
బీజేపీ వ్యూహంతో మహ కూటమి విచ్ఛిన్నమైంది. అంతకాకుండా నితీశ్ కుమార్.. మోదీ పక్కకు చేరారు. దీంతో ఆరవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారానికి మోదీ వస్తారని ముమ్మర ప్రచారం సాగింది. కాని మోదీ హాజరుకాలేదు. దీనికి కారణం అబ్దుల్ కలాం రెండవ వర్ధంతి అని తెలుస్తోంది. మోదీ రామేశ్వరంలో కలాం స్మారక భవానాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈ కార్యక్రమం నెల రోజుల కిందటే షెడ్యూల్ లో చేరిపోయింది. రామేశ్వరం వెళ్లాల్సి వచ్చినందునే మోదీ, పాట్నాకు రాలేకపోయారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త, అబ్దుల్ కలాంకు గౌరవాన్నివ్వకుంటే విమర్శలు వస్తాయని భావించిన మోదీ, రామేశ్వరం వెళ్లేందుకే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దీంతో ఆయన నితీశ్ ను ఫోన్ లో అభినందించారని బీజేపీ నేతలు తెలిపారు. ఈ ఉదయం రామేశ్వరం చేరుకున్న మోదీ, అక్కడ నిర్మించిన స్మారక మందిరాన్ని ప్రారంభించారు. అలాగే రామేశ్వరం – అయోధ్య రైలు ప్రారంభించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.