Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Why MPs from other parties ignored ChandraBabu Naidu in Delhi?

By   /  April 4, 2018  /  Comments Off on Why MPs from other parties ignored ChandraBabu Naidu in Delhi?

    Print       Email

పాపం.. బాబు!

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* బాబును ప‌ట్టించుకోని ఇత‌ర పార్టీల‌ ఎంపీలు

* వైర‌ల్‌గా మారిన బాబు ఢిల్లీ టూర్ వీడియోలు

* బాబుకు అంత సీన్ లేదంటున్న ప్ర‌తిప‌క్షాలు

డెక్క‌న్ అబ్రాడ్‌:  9 ఏళ్లు ముఖ్య‌మంత్రి.. 10 ఏళ్లు ప్ర‌తిప‌క్ష నేత‌.. ఇప్పుడు నాలుగేళ్లుగా ముఖ్య‌మంత్రి.. 40 ఏళ్ల‌కు పైగా రాజ‌కీయ జీవితం.. ఇద్ద‌రిని ప్ర‌ధానుల‌ను, ఒక‌రి రాష్ట్ర‌ప‌తిని చేసిన అనుభ‌వం. ఢిల్లీలో చ‌క్రం తిప్పాన‌ని, ఎప్ప‌టికైనా తిప్పుతాన‌ని చెప్పుకునే ధైర్యం. అన్నీ క‌ల‌గ‌లిపితే నారా చంద్ర‌బాబు నాయుడు. అయితే ఈ రోజు చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న చూస్తే ఇదంతా గ‌తం.. ఇప్పుడు అంత లేదు అనిపించ‌క త‌ప్ప‌డం లేదు. 40 ఇయ‌ర్స్ అని చెప్పుకునే చంద్ర‌బాబుకు అనుకున్న స్థాయిలో ఢిల్లీలో ప‌లుపార్టీల నాయ‌కులు పెద్ద‌గా ప్రియారిటీ ఇవ్వ‌క‌పోవ‌డం పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

 

అంతేకాదు.. చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ రాగానే పార్ల‌మెంటుకు వెళ్లి అక్క‌డ గాంధీ విగ్ర‌హానికి కాళ్లు ముక్క‌డం.. త‌ర్వాత పార్ల‌మెంట్ భ‌వ‌నం మెట్ల‌కు ముక్క‌డం వంటి ఫోటో షూటు కార్య‌క్ర‌మంలో బాబు అడ్డంగా బుక్ అయ్యారు. చంద్ర‌బాబు ఢిల్లీ వ‌చ్చింది ప్ర‌త్యేక హోదా కోసం పోరాటానికా?  ఫోటో సూట్‌గా అన్న విమ‌ర్శ‌లు కూడా వెల్లువెత్తాయి. అంతేకాదు ఒక ముఖ్య‌మంత్రి స్థానంలో ఉంటూ ఫోటోల‌కు అంత ఇంపాటెన్స్ ఇవ్వ‌డం  ఏంటి అంటూ ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం విమ‌ర్శిస్తున్నారు. కాగా చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న మొద‌టి రోజు మాత్రం ఆ పార్టీకి అనుకున్నంత మైలేజీ రాక‌పోగా చెడ్డ‌పేరు మాత్రం కావ‌ల్సినంత వ‌చ్చింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →