Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Why not release the video? Why are you hiding the facts from Assembly?

By   /  March 13, 2018  /  Comments Off on Why not release the video? Why are you hiding the facts from Assembly?

    Print       Email

ఆ వీడియోను ఎందుకు రిలీజ్ చేయ‌లేదు?

Suvidha
Biryani Pot

 

 

 

* స్వామిగౌడ్‌ను ఆస్ప‌త్రిలో చేర‌మ‌ని కేసీఆరే చెప్పారు
* ఇదంతా కేసీఆర్ డ్రామా
* మీడియా స‌మావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

డెక్క‌న్ అబ్రాడ్‌: మా పార్టీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి హెడ్‌ఫోన్ విసిరేది ప‌దే ప‌దే చూపిస్తున్నార‌ని, ఆ హెడ్‌ఫోన్ ఎక్క‌డ ప‌డింది? మండ‌లి చైర్మ‌న్ స్వామిగౌడ్‌కు ఎక్క‌డ త‌గిలింది అనే వీడియోను ఎందుకు రిలీజ్ చేయ‌డం లేద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి డిమాండ్‌చేశారు. మీకో న్యాయం? మాకో న్యాయ‌మా అంటూ ప్ర‌శ్నించారు. అసెంబ్లీలో చోటు చేసుకున్న సంఘ‌ట‌నపై ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోమటి రెడ్డి ఒకవైపు నుంచి హెడ్‌ఫోన్స్‌ను విసిరేస్తే.. అది ఎక్కడో ఉన్న చైర్మన్ కుడి కన్నుకు ఎలా తగులుతుందని ప్రశ్నించారు. మండలి చైర్మన్‌ అంటే తమకు గౌరవం ఉందని.. ఆయనపై అనుచితంగా ప్రవర్తించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఇక ఆసుపత్రిలో చేరమని సీఎం కేసీఆర్‌నే స్వామి గౌడ్‌కు చెప్పినట్లు ఆయనే ఒప్పుకున్నారని తెలిపారు. వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేయడం తమ తప్పైతే.. అప్పట్లో హరీశ్ రావు గవర్నర్‌పై దాడి కూడా చేశారని.. ఇప్పుడు కూడా పార్లమెంట్‌లో వారి పార్టీ ఎంపీలు, కేసీఆర్ కుమార్తె కవిత చేస్తున్నది ఏంటి అని ఆయన ప్రశ్నించారు.

ఆందోళనపై కనీసం కమిటీ కూడా వేయకుండా అందరినీ సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యంలో భాగమా అంటూ మండిపడ్డారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని.. ఆ పదవికి మధుసూధనాచారి అప్రతిష్ట తీసుకొచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మమ్మల్ని సస్పెండ్ చేసిన తరువాత కేసీఆర్‌కు మైక్ ఇచ్చి తిట్టించడం ఏంటని? ఏ స్పీకర్‌కు లేని ప్రత్యేక అధికారాలు మధుసూధనాచారికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ చాలా దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని, ఇలాగే చేస్తే వ‌చ్చి ఎన్నిక‌ల్లో కేసీఆర్ త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌న్నారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Birthday wishes to legend Ghantasala

Read More →