Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Why Shivraj Singh Chouhan didn’t want to get his ‘soos’ and ‘saks’ wet

By   /  August 22, 2016  /  Comments Off on Why Shivraj Singh Chouhan didn’t want to get his ‘soos’ and ‘saks’ wet

    Print       Email

shivraj singh chouhan 1ముఖ్యమంత్రికి రాచ మర్యాదలు..?

 

InCorpTaxAct
Suvidha

 

 

పూర్వకాలంలో రాజరికాలు ఉండేవని విన్నాం.. వారి హయాంలో రాజులు నడుస్తూంటే కాళ్ళు నొప్పిపుట్టకుండా పువ్వులు చల్లేవారట. మెత్తిన బట్టలు పరిచేవారట. అలాంటి సంప్రదాయాలు అప్పట్లో ఉండేవని మనకు తెలుసు. అలాంటి ఆచారాన్ని అడుగులకు మడుగులొత్తడం అంటారు. ప్రస్తుతం భారత్ లో ప్రజాస్వాయ్యం వర్ధిల్లుతోంది. కాని కొందరు నేతలు తమను తాము రాజులుగా భావించుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో కొందరు నేతలు తమ సిబ్బంది చేత చెప్పులు తొడిగించుకోవడం వంటి వార్తలు చదివాం. అలాంటి సంఘటనలను చూస్తున్నాం.

ఇలాంటిదే మధ్యప్రదేశ్ లో మరో ఘటన చోటుచేసుకుంది. అక్కడ వరదలు ముంచెత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ బాధితులను పరామర్శించేందుకు వెళ్ళారు. పన్నా జిల్లాలోని అమన్ గంజ్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ టూర్ లో ఆయనకు పోలీసులు సకల మర్యాదలు చేశారు. కొంచెం నీళ్ళు ఉన్న చోట ఆయనను చేతులపైకి ఎత్తుకొని తీసుకెళ్ళారు. బురద ఉన్న ప్రాంతాల్లో ఆయన బూట్లు విప్పి నడుస్తూంటే.. ఆ చెప్పులను ఒకరు మోసుకుంటూ వెళ్ళారు.
అయితే కొందరు ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ తమ చర్యలను సమర్ధించుకున్నారు. నీళ్ళలో పాములు వంటి విష కీటకాలు ఉంటాయి. వాటివల్ల ముఖ్యమంత్రికి ప్రమాదం జరగవచ్చు. అందుకే మోయించాలని ఆదేశించామని చెబుతున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →