Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Why Some of The TRS Leaders Resigned?

By   /  January 6, 2018  /  Comments Off on Why Some of The TRS Leaders Resigned?

    Print       Email

టీఆర్‌ఎస్‌ పార్టీకి పలువురి రాజీనామా..కారణం అదేనా..!

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంతో టీడీపి, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎంతో మంది టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. అలాంటిది కొంతమంది టీఆర్ఎస్ కి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్‌ నియంత పోకడకు నిరసనగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

మాజీ ఎంపీపీ, సీనియర్‌ నాయకులు బాణోత్‌ దేవ్లానాయక్‌, పేరుపల్లి సర్పంచ్‌ దారవత్‌ ఈరీ, సీతారాంపురం ఎంపీటీసీ సభ్యులు సక్రాం, మాదారం సర్పంచ్‌ దారవత్‌ మంగీలాల్‌, మండల రైతు సమన్వయ కమిటి సభ్యులు దమ్మలపాటి ప్రసాదు, మండల పార్టీ మాజీ కార్యదర్శి అడ్డగోడ అయిలయ్యతో పాటు పలువురు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను పట్టించుకోకుండా తన ఇష్టానుషారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షుడికి పంపిస్తున్నట్లు తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →