రాజ్యసభలో స్పెషల్ స్టేటస్ చర్చలో టీడీపీ ఎంపీల నోటికి ప్లాస్టర్లు: బొత్స సత్యనారాయణ
ఏపీ ప్రత్యేక హోదాపై టీడీపీ ఎందుకు సైలెంట్ అయిపోతోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీలు అంతా మౌనంగా ఎందుకు ఉన్నారని నిలదీశారు. వారు నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారని మండిపడ్డారు. సభలో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అన్న భయం వారిలో ఉందని అన్నారు.ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ తెలంగాణ ఎంపీలు కూడా మద్దతు ప్రకటించారని అన్నారు. ఈ అంశంలో జాతీయ పార్టీల ఎంపీలు కూడా స్పందించారని అన్నారు. అయినప్పటికీ టీడీపీ ఎంపీలు మాత్రం సైలెన్స్ పాటించారని అన్నారు
చంద్రబాబు కాంట్రాక్టులు, కమిషన్ల కోసం ఏపీని తాకట్టు పెట్టారని విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కూడా ఏపీ సర్కారు విఫలం అయిందని అన్నారు. ఎన్డీయే సర్కారులో టీడీపీ భాగస్వామిగా ఉందని అన్నారు. అయినా కూడా ఏపీకి పెద్దగా ఒరిగిందేమీ లేదని అన్నారు. టీడీపీ ఎంపీలు కేంద్రంతో ఉన్న సంబంధాలను సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అన్నారు.మీడియా సమావేశంలో బొత్స సత్యానారాయణ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.