అందాల ముద్దుగుమ్మ నయనతార నకిలీ వీసా కేసులో పట్టుబడ్డారు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. నయన్ ప్రస్తుతం విక్రమ్ సరసన ఇరుముగన్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ మలేషియాలో జరిగింది. అందులో పాల్గొన్న ఆమె తిరిగి ఇండియా బయలుదేరారు. ఇందులో భాగంగా మలేషియా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే అక్కడ కేఎల్ 1.. కేఎల్ 2 అనే రెండు రకాల టెర్మినల్ విధానాలు అమలు చేస్తున్నారు. ఇక్కడే ఆమె కాస్త కంగారు పడ్డారు. కేఎల్ 1 టెర్మినల్ ద్వారా ప్రవేశించాల్సి ఉండగా.. కేఎల్ 2 టెర్నినల్ దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఉన్న ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసా తనిఖీ చేసి సరిగా లేవంటూ చెప్పారు. దీంతో చిన్నపాటి కలకలం రేగింది. అయితే వారికి నయనతార క్లారిటి ఇచ్చి ఇండియా చేరుకున్నారని ‘ఇరుముగన్’ చిత్ర బృందం తెలియజేసింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.
అయితే ఈ సీన్ పై సోషల్ మీడియాలో ఓవర్ గా ప్రచారం జరిగింది. నయన్ నకిలి పాస్ పోర్టుతో అరెస్ట్ అయ్యారంటూ మలేషియా ఇంటర్నెట్ లో ప్రచారం కావడంతో.. చిత్ర యూనిట్ ప్రకటన చేసి వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇటీవలె ఈ ముద్దుగుమ్మ ‘నానున్ రౌడిదాన్’ చిత్ర సన్నివేశంలో ఒక టాస్మార్క్ షాపులో మద్యం బాటిల్ కొంటున్న ఫొటో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. మళ్లీ పాస్ పోర్ట్ అంశంపై కూడా ప్రచారం జరగడంతో నయన్ నవ్వుకున్నారట.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.