మహారాష్ట్రలో శివసేనకు బీజేపీ షాక్..?
మహారాష్ట్రలో బీజేపీ-శివసేన సర్కారు అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా శివసేన మద్దతు తీసుకుంది. అయితే కేంద్రంలో ఇరువురి మధ్య కాపురం బాగానే సాగుతోంది. అయితే రాష్ట్రంలో మాత్రం రెండు పార్టీల మధ్య సఖ్యత కొరవడింది. బీజేపీపై ఉద్ధవ్ థాకరే పలుమార్లు అలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇక వచ్చే ఏడాది ప్రధమార్ధంలో బృహన్ ముంబై మహానగర్ పాలికా (బిఎంసీ)కి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో శివసేనతో పొత్తు పెట్టుకోరాదని బీజేపీ నిర్ణయించింది. ఒంటరిగానే బరిలోకి దిగాలని నిశ్చియించుకుంది. ప్రస్తుతం బిఎంసీ శివసేన చేతుల్లో ఉంది. అయితే శివసేన అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్న ముంబై వాసుల వాదనకు బీజేపీ మద్దతుగా నిలుస్తోంది. ఒంటరిగా పోటీ చేసి శివసేనకు చెక్ పెట్టాలని కమలనాధులు భావిస్తున్నారు.
227 స్థానాలున్న బిఎంసీలో గత ఎన్నికల్లో శివసేన 76 స్థానాలు గెలుచుకుంది. బీజెపి 32 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 50,ఎంఎన్ఎస్ 28, ఎన్సీపీ 14, ఎస్పీ8 స్థానాలు గెలుచుకున్నాయి. 20ఏళ్లుగా బిఎంసీ బీజెపి-శివసేన పాలనలో ఉంది.బీజేపి తాజా నిర్ణయంతో ముంబైలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.