Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Will Lokesh bring TDP back into Telangana?

By   /  June 19, 2016  /  Comments Off on Will Lokesh bring TDP back into Telangana?

    Print       Email

nara lokesh newచిన‌బాబు గ‌త వైభ‌వం తెస్తాడా?

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్  తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీకి గ‌త వైభ‌వాన్ని తీసుకువ‌స్తాడా? మ‌ళ్లీ అధికారంవైపు టీడీపీ వ‌స్తుందా?  ఇప్ప‌టికే నాయ‌కులు, క్యాడ‌ర్ టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయిన నేప‌థ్యంలో చిన‌బాబు పార్టీకి కొత్త క్యాడ‌ర్‌ను త‌యారు చేయ‌గ‌ల‌డా? అంటే కొంచెం క‌ష్ట‌మైన ప‌నే అయినా ప్ర‌య‌త్నాలు మాత్రం చేస్తున్నారు.  టీఆర్ఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు టీడీపీ విల‌విల్లాడింది. అంతేకాదు బాగా ఢీలాప‌డిపోయింది. ప్ర‌స్తుతం టీడీపీకి కేవ‌లం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే మిగిలి ఉన్నారు.  దీంతో టీటీడీపీలో మిగిలిన నాయ‌కుల‌కు మ‌నోధైర్యం చెప్పేందుకు ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ రంగంలోకి దిగారు. సాధార‌ణ ఎన్నిక‌ల‌య్యాక కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుతో పాటు లోకేష్ సైతం హైద‌రాబాద్‌లో ఉంటూ ఇక్క‌డి పార్టీ వ్య‌వ‌హారాలు ప‌ట్టించుకునేవారు. త‌ర్వాత వీరు పూర్తిగా విజ‌య‌వాడ‌కే ప‌రిమితం కావ‌డంతో తెలంగాణ‌లో పార్టీ కార్య‌క‌లాపాలు లేకుండా పోయాయి. ఉన్న ఒక‌రిద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వయం లేక‌పోవ‌డంతో పార్టీ ఉందా లేదా అన్న సందేహాలు సైతం క‌లిగాయి.

తెలంగాణ‌లో టీడీపీకి పున‌ర్వైభ‌వం తీసుకు వ‌చ్చేందుకు లోకేష్ రంగంలోకి దిగారు. ప్ర‌తి శ‌నివారం ఆయ‌న తెలంగాణ టీడీపీ నాయ‌కుల‌తో స‌మావేశం అవుతూ ఇక్క‌డ పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చర్య‌ల‌పై చ‌ర్చించేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించారు.  అధికార పార్టీ అధికార దుర్వినియోగాల‌తో పాటు తెలంగాణలో మైనార్టీ, గిరిజన రిజర్వేషన్ల అమ‌లుకు ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాడాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అలాగే ఖాళీగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు త్వ‌ర‌లోనే ఇన్‌చార్జ్‌ల నియ‌మించాల‌ని… ఇక తెలంగాణ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు హైదరాబాద్‌‌తో పాటు వరంగల్‌‌లోనూ పార్టీ శిక్షణా శిభిరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా పార్టీని బ‌లోపేతం చేయ‌డం మాత్రం లోకేష్ కు క‌త్తిమీద సాములాంటిదేనంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →