పాలేరులో టీఆర్ఎస్ పోటీ చేస్తుందా..?
తెలంగాణ శాసన సభలో ఓ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయింది. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడ బై ఎలక్షన్ జరగాల్సి ఉంది. అయితే ఆయన కుటుంబ సభ్యుడుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని పలువురు నేతలు కోరుతున్నారు. మరి దీనికి టీఆర్ఎస్ అంగీకరిస్తుందా అన్నది సందేహమే. ప్రస్తుతం అయితే దీనిపై టీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి టాక్ లేదు.
ఇంతకుముందు ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందితే.. వారి కుటుంబ సభ్యులను బరిలో నిలిపేవారు. ఇక మిగిలిన పార్టీలు కూడా వారికి సహకరించేవారు. ఇది ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. దీన్నీ దృష్టిలో పెట్టుకుని నారాయణ్ ఖేడ్ నియోజక వర్గంలో కిష్ణారెడ్డి మరణించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక గురించి ప్రతిపాదన తీసుకువచ్చింది. అయితే దీనికి గులాబీ నేతలు అంగీకరించలేదు. ఉప ఎన్నికలకు దిగడంతో.. ఆ స్థానం టీఆర్ఎస్ వశం అయింది.
ప్రస్తుతం రాంరెడ్డి వెంకట్రెడ్డి మరణంతో పాలేరు స్థానం ఖాళీ అయ్యింది. మరి ఇక్కడ కూడా టీఆర్ఎస్ బరిలో నిలుస్తుందా..? లేకపోతే వారి కుటుంబసభ్యులకు వదిలేస్తుందా..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అసెంబ్లీ సంతాప తీర్మాన సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్ ప్రభుత్వాన్ని పోటీ చేయకుండా ఏకగ్రీవం అయ్యేట్లు చూడాలని కోరారు.
ఇక కాంగ్రెస్ పార్టీ అయితే కనీసం ఈ నియోజక వర్గాన్ని అయినా నిలబెట్టుకోవాలని భావిస్తోంది. పోటీ లేకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేపట్టింది. అలాగే ముఖ్యమంత్రిని ఒప్పించేందుకు కూడా పలువురు హస్తం నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇక.. టీఆర్ఎస్ అయితే వరుస విజయాలతో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. టీఆర్ఎస్ కి పాలేరు ఉప ఎన్నికల్లో పోటీచేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే కాంగ్రెస్ టిక్కెట్ ఎవరికి ఇచ్చే అవకాశం ఉందో పరిశీలించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.