Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Winning in By election is not a big deal: Buggana Rajendranath

By   /  September 13, 2017  /  Comments Off on Winning in By election is not a big deal: Buggana Rajendranath

    Print       Email

బై ఎలక్షన్ లో నెగ్గడం పెద్ద గొప్పేం కాదు: వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

 

EIS
EnGeniusInc

 

 

బై ఎలక్షన్లలో అధికారంలో ఉన్న పార్టీ గెలవడంలో పెద్ద గొప్పేముందని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. 2004 నుంచి 2014 మధ్య జరిగిన ఉపఎన్నికల్లో 40కి పైగా సీట్లలో టీడీపీ ఓడిపోయిందని గుర్తు చేశారు. ఆ పార్టీకి అప్పట్లో కనీసం మూడు వంతుల స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదన్నారు. అలాగే ఇటీవల జరిగిన ఎన్నికలపై కూడా మాట్లాడారు.

నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఎలా గెలిచిందో అందరికి తెలుసని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 175 స్థానాల్లో గెలవాలని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది ముమ్మాటికి చంద్రబాబు నియంత ధోరణిని సూచిస్తోందని చెప్పారు. సీఎం చంద్రబాబుకి ఉన్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల వ్యవహారాన్ని విపక్షం నిలదీస్తుందనే భయం ఉందన్నారు. అందువల్లే శాసనసభ సమావేశాలను నిర్వహించడం లేదన్నారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Chief Minister opens new sand quarries to increase personal income: Anbumani.

Read More →