ఆ విషయంలో అమ్మాయిలే టాప్!
ఏ విషయంలో అయినా మహిళలు మగవాళ్లతో పోటీ పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాల్లో వాళ్లే ముందుంటున్నారు కూడా. చదువు.. ఉద్యోగం.. వ్యాపారం.. ఆఖరుకు సోషియల్ మీడియాలో కూడా వాళ్లతో పైచేయి అయింది. ఆ విషయం తాజా సర్వేలో వెల్లడైంది. వివరాల్లోకి వెళ్లితే…పాశ్చాత్యదేశాల్లో అమ్మాయిలే సోషల్ మీడియాను అధికంగా ఉపయోగిస్తున్నారని లేటెస్టు సర్వేలు చెబుతున్నాయి. ఇంటర్నెట్ వాడే వారిలో ఫేస్ బుక్ యూజర్లుగా ఉన్న అమ్మాయిల శాతం 76గా ఉందని తేలింది. ట్విట్టర్ వాడకంలోనూ ఫీమేల్ యూజర్లదే పైచేయి అట. పింట్రెస్ట్ – ఇన్ స్టాగ్రామ్ విషయంలోనూ ఇదే పరిస్థితి. వీటికీ అమ్మాయిల ఆదరణే ఎక్కువగా ఉంది. అమెరికాలో వీటికి యూజర్లుగా ఉన్న మహిళల సంఖ్య కోటికి చేరింది. అయితే లింక్డ్ ఇన్ సైట్ మాత్రం మేల్ యూజర్ల డామినేషన్లో ఉంది.
ఇదిలా ఉంటే సోషియల్ మీడియాను బేస్ చేసుకుని అమ్మాయిలు వాళ్ల సొంత వ్యాపారు మొదలు పెట్టారట. వాళ్లు చేసే ప్రతి చిన్న విషయాన్ని, వాళ్ల కంపెనీల చరిత్రను, అభివృద్ధిని ఎప్పటికప్పుడు సోషియల్ మీడియాలో అప్డేట్ చేస్తూ వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటున్నారట. ఏది ఏమైనా మగవాళ్లతో మహిళలు సమానం అనేదానికంటే కూడా మహిళలు కొంచెం ఎక్కువ సమానం అంటే బాగుంటుందని కూడా వాళ్లు అంటున్నారు. సో అబ్బాయిలు తస్మాత్ జాగ్రత్త!
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.