తఢాకా చూపిన మహిళా సీఎంలు
మహిళలను తక్కువ అంచనా వేయకూడదని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చూస్తే అర్థమవుతుంది. రాజకీయాల్లో మగవాళ్లకు ఏ మాత్రం తీసిపోని నిరూపిస్తున్నారు. ఈ రోజు వచ్చిన ఎన్నికల ఫలితాల్లో విజయఢంకా మోగించారు. తమిళనాడు ప్రజలు కుటుంబ రాజకీయాలకు తెరదించారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడీఎంకె అధినేత్రి జయలలిత విజయగర్వంతో అన్నారు. కుటుంబ రాజకీయాలకు గుణపాఠంగా ప్రజలు తనను గెలిపించారని ప్రజల నమ్మకానికి తగ్గట్టు పాలన అందిస్తానని ఆమె ప్రకటించారు. జయలలిత నివాసం ఉంటున్న పోయస్ గార్డెన్ లో ఆమె అభిమానులు – కార్యకర్తలు సంబరాలు జరుపుతున్నారు. ఉదయం కౌంటింగ్ ప్రారంభించన కాసేపటికే తమ పార్టీ పలు స్థానాల్లో ఆధిక్యతలో ఉందని తెలుసుకుని కార్యకర్తలు స్వీట్లు పంచుకుని ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు. 1989 తర్వాత వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా అన్నాడీఎంకే చరిత్ర సృష్టిస్తోంది. ఆరోసారి సీఎం పదవిని చేపట్టిన ఘనత జయలలిత దక్కుతుంది.
మీఇక వరసగా రెండోసారి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోనున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ డియాతో మాట్లాడుతూ తన పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అఖండ విజయం చేకూర్చారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు తిరుగులేని ఆధిక్యత లభించడంతో ఎన్నికల సందర్భంగా విపక్షాలు చేసిన తప్పుడు ప్రచారాన్ని బెంగాల్ ప్రజలు ఏ మాత్రం విశ్వసించలేదని తేలినట్లుగా చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.