Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

Writer Yaddanapudi Sulochana Rani died aged 78

By   /  May 21, 2018  /  No Comments

    Print       Email

ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కన్నుమూశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో కుమార్తెతో పాటు ఉంటున్న ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.

 

Suvidha
Biryani Pot

యద్దనపూడి సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో జన్మించారు. కుటుంబ కథనాలు రాయడంలో ఆమె తనకు తానే సాటి అని నిరూపించుకుని తెలుగునాట సుప్రసిద్ధ రచయిత్రిగా ఖ్యాతి గడించారు. ‘నవలా దేశపు రాణి’గానూ ఆమె ప్రసిద్ధి చెందారు. ఆమె రాసిన అనేక నవలలు.. సినిమాలు, టీవీ సీరియళ్లుగా తెరకెక్కాయి. మీనా, ఆగమనం, ఆరాధన, అగ్నిపూలు, ఆహుతి, అమర హృదయం, రుతువులు నవ్వాయి, కలల కౌగిలి, ప్రేమ పీఠం, బహుమతి, బంగారు కలలు, మౌనతరంగాలు, మౌన పోరాటం, మౌనభాష్యం, వెన్నెల్లో మల్లిక, విజేత, శ్వేత గులాబి, సెక్రటరీ తదితర నవలలు రచించారు. ఆమె రచనల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నవల ‘మీనా’. దీని ఆధారంగానే ‘మీనా’ చిత్రం తెరకెక్కింది.

అక్కినేని, శోభన్ బాబు లాంటి అగ్ర నటులను నవలా నాయకులుగ తీర్చి దిద్దిన పేరు తనకే దక్కుతుంది

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలనే భగవంతుడిని ప్రార్ధిస్తూ

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Appeal from Sankara Nethralaya OM Trust, Inc

Read More →